రైళ్ల ద్వారా పార్శిల్ పంపడం ఈజీ.. యాప్‌లోనే అన్నీ..

Venkatrao Lella

Images: Pinterest

30 OCT 2026

ప్రయాణికులకు రైల్వేశాఖ అదిరిపోయే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్శిల్ సేవల కోసం ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి ఇంటి నుంచే పార్శిల్ పంపించుకోవచ్చు.

ఇప్పటివరకు రైళ్ల ద్వారా ఏదైనా పార్శిల్ పంపించాలంటే ముందుగా స్టేషన్‌కు వెళ్లి అక్కడి పార్శిల్ కార్యాలయాలను సంప్రదించాల్సి వచ్చేది. దీని వల్ల సమయం వృథా అవ్వడంతో పాటు ఖర్చు ఎక్కువ అయ్యేది. ఇప్పుడు సమయం, డబ్బు రెండూ ఆదా అవ్వనున్నాయి.

పార్శిల్ సేవల కోసం యాప్‌ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వే పార్శిల్ యాప్: ఘర్ సే ఘర్ తక్ పేరుతో యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్శిల్ బుకింగ్ చేసుకోవడంతో పాటు ట్రాకింగ్, డెలివరీ స్టేటస్ అన్నీ తెలుసుకోవచ్చు.

డెలివరీ సేవల కోసం లాజిస్టిక్స్ కంపెనీలతో రైల్వేశాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాప్‌నే కాకుండా వెబ్ సైట్ కూడా లాంచ్ చేసింది. దీంతో పోర్టల్ ద్వారా కూడా పార్శిల్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయవచ్చు

తొలి దశలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, అహ్మదాబాద్, కోల్ కత్తా, ముంబై వంటి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. విడతల వారీగా అన్ని నగరాల్లోనూ వీటిని తీసుకురానున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ప్రజలు పార్శిళ్లు పంపించుకోవచ్చు.

7 నగరాల్లోని 17 స్టేషన్లలో ఈ డెలివరీ సేవలను అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన నగరాల్లో డెలివరీ సర్వీసులు ప్రారంభించారు. ఇది విజయంతం కావడంతో రాబోయే రోజుల్లో అన్ని నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి.

రైల్వే పార్శిల్ సర్వీసుల్లో మూడు దశలు ఉంటాయి. ఒకటి పార్శిల్ పికప్ కాగా.. రెండోవది ట్రైన్ ద్వారా గమ్యస్థానానికి పంపడం. ఇక మూడోవది రైలు నుంచి దించిన వస్తువును స్వీకర్తకు అందించడం.

అయితే సేవ అందుబాటులో ఉన్న ప్రదేశం, వస్తువు స్వభావాన్ని బట్టి డెలివరీ సమయంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇక మీరు పార్శిల్ పికప్ కోసం బుకింగ్ చేసుకున్న తర్వాత రద్దు చేస్తే రూ.10 క్లర్కేజ్ ఫీజుగా కట్ చేస్తారు. మిగతా సొమ్ము రీఫండ్ అందుతుంది.

ఇక డెలివరీ ఛార్జీలు, రీఫండ్ అనేవి లాజిస్టిక్ కంపెనీ నిబంధనలను బట్టి మారుతూ ఉంటాయి. దీంతో బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి పరిశీలించడం మంచిది.