AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డబ్బు డబుల్ అవ్వాలా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్‌లో పెట్టుబడితో అదిరే లాభాలు..

స్టాక్ మార్కెట్లలో ఉండే రిస్క్ చూసి భయపడుతున్నారా? రూపాయి నష్టం లేకుండా పెట్టిన పెట్టుబడి డబుల్ అవ్వాలని కోరుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర మీకు సరైన ఎంపిక. కేవలం రూ. 1,000 నుంచే ప్రారంభించే ఈ పథకంలో మీ డబ్బులు ఎన్నేళ్లలో రెట్టింపు అవుతాయి? వడ్డీ రేట్లు, విత్‌డ్రాయల్ నిబంధనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీ డబ్బు డబుల్ అవ్వాలా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్‌లో పెట్టుబడితో అదిరే లాభాలు..
Post Office Kisan Vikas Patra
Krishna S
|

Updated on: Oct 31, 2026 | 7:00 PM

Share

నేటి రోజుల్లో కేవలం డబ్బు సంపాదించడమే కాదు.. కష్టపడి సంపాదించిన రూపాయిని సరైన మార్గంలో పొదుపు చేయడం కూడా ఎంతో ముఖ్యం. చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఉండే రిస్క్ చూసి అటువైపు వెళ్లడానికి భయపడుతుంటారు. పైసా నష్టం లేకుండా, ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన సురక్షితమైన రాబడిని కోరుకునే వారికి పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది. కేవలం రూ. 1,000 నుంచే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటంతో సామాన్యులకు ఇది చక్కటి ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కిసాన్ వికాస్ పత్ర అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే పాపులర్ చిన్న పొదుపు పథకం. ప్రస్తుత త్రైమాసికానికి ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం వార్షికంగా 7.5 శాతం స్థిర వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం.. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తం 115 నెలల్లో (అంటే సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలల్లో) రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువులు లేదా భవిష్యత్తు అవసరాల కోసం రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

లెక్కలు ఇలా..

  • రూ.50,000 – 9 ఏళ్ల 7 నెలలు – రూ. 1,00,000
  • రూ.1,00,000 – 9 ఏళ్ల 7 నెలలు – రూ. 2,00,000
  • రూ.5,00,000 – 9 ఏళ్ల 7 నెలలు – రూ. 10,00,000

రూ. 1,000 నుంచే ప్రారంభం.. గరిష్ట పరిమితి లేదు..

ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000 కాగా, ఆపై రూ.100 గుణిజాల్లో ఎంతైనా జమ చేసుకోవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి లక్షల్లోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఖాతాను సింగిల్ ఖాతాగా లేదా గరిష్టంగా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్ ఖాతాగానూ ప్రారంభించవచ్చు. అలాగే 10 ఏళ్లు పైబడిన పిల్లల పేరు మీద గార్డియన్ల పర్యవేక్షణలో కూడా ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది.

మధ్యలోనే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా?

మెచ్యూరిటీ కంటే ముందే అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఏంటనే సందేహం చాలామందికి ఉంటుంది. కేవీపీ ఖాతా ప్రారంభించిన తర్వాత రెండున్నర సంవత్సరాలు పూర్తయితే, నిర్దేశిత నిబంధనలకు లోబడి ఖాతాను క్లోజ్ చేసుకుని అసలు, వడ్డీని విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా ఏదైనా అత్యవసర సమయాల్లో బ్యాంకుల నుంచి పర్సనల్ లేదా బిజినెస్ లోన్లు పొందేందుకు ఈ కేవీపీ సర్టిఫికేట్‌ను పూచీకత్తుగా కూడా ఉపయోగించుకోవచ్చు.

పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన నిబంధనలు

చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అయితే మీరు పోస్ట్ ఆఫీస్‌లో కేవీపీ సర్టిఫికేట్ తీసుకున్న రోజున ఏ వడ్డీ రేటు అమల్లో ఉందో మెచ్యూరిటీ ముగిసే వరకు అదే వడ్డీ రేటుతో మీ డబ్బులు రెట్టింపు కావడం జరుగుతుంది. మధ్యలో ప్రభుత్వ వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినా మీ పాత డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఈ పథకం ద్వారా వచ్చే రాబడికి ఎలాంటి ప్రత్యేక పన్ను మినహాయింపులు ఉండవు. మెచ్యూరిటీ సమయంలో లభించే వడ్డీపై వర్తించే నిబంధనల ప్రకారం పన్ను పడుతుందని గుర్తుంచుకోవాలి.

Follow Us
మీ డబ్బు డబుల్ అవ్వాలా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్‌లో..
మీ డబ్బు డబుల్ అవ్వాలా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్‌లో..
లక్షణాలు కనిపించకపోయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు..
లక్షణాలు కనిపించకపోయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు..
నవంబర్ 2026 పండుగలు: దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు..
నవంబర్ 2026 పండుగలు: దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు..
ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కశ్మీరీ పులావ్ చేయండి
ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కశ్మీరీ పులావ్ చేయండి
ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు ఎందుకు బోల్తా కొట్టాయంటే..
ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు ఎందుకు బోల్తా కొట్టాయంటే..
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కూతురి అన్న ప్రాసన..ఏం పేరు పెట్టారంటే?
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కూతురి అన్న ప్రాసన..ఏం పేరు పెట్టారంటే?
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న..
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న..
 ఇంట్లో ఈ తప్పులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు!
 ఇంట్లో ఈ తప్పులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు!
తినడానికి వెళ్తే టాయిలెట్ నీళ్లు తాగించారు..!
తినడానికి వెళ్తే టాయిలెట్ నీళ్లు తాగించారు..!
ఆ హీరోతో నేను చేయాల్సిన సినిమా మిస్సయ్యింది.. వివి వినాయక్.
ఆ హీరోతో నేను చేయాల్సిన సినిమా మిస్సయ్యింది.. వివి వినాయక్.