AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: పది రోజుల్లోనే భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు గుడ్ న్యూస్!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతున్న పసిడి ధరలు తాజాగా మరోసారి దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గగా, 22 క్యారెట్ల ధర కూడా తగ్గింది. వెండి కిలో ధర సైతం స్వల్పంగా దిగివచ్చింది. నేటి తాజా ధరలు, పూర్తి వివరాలు తెలుసుకోండి.

Gold Rate: పది రోజుల్లోనే భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు గుడ్ న్యూస్!
Gold And Silver Rates
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2026 | 6:41 AM

Share

బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమవుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు భారీగా తగ్గుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత 15 రోజులుగా.. దాదాపు 15 నుంచి 17 వేల వరకు బంగారం ధర తగ్గింది. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనాలని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించినట్లయింది. కొన్ని రోజులుగా పసిడి ధరల్లో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

బంగారం, వెండి ధరలు ఇలా..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి.. రూ.1,30,680 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,19,790 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.1,79,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,30,680, 22 క్యారెట్ల ధర రూ.1,19,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,79,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,680 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,19,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,79,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,30,830, 22 క్యారెట్ల ధర రూ.1,19,940 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,79,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,30,680, 22 క్యారెట్ల ధర రూ.1,19,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,79,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,30,680, 22 క్యారెట్ల ధర రూ.1,19,790 ఉంది. వెండి కిలో ధర రూ.1,79,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,30,680, 22 క్యారెట్ల ధర రూ.1,19,790 ఉంది. వెండి కిలో ధర రూ.1,79,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us