AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు కలిసి చదువుకున్నారు.. ఇప్పుడు ఇద్దరూ తోపు హీరోలు.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల స్కూల్ డేస్ ఫోటో తెగ వైరలవుతుంది. ఈ ఫోటోలో తరగతిలోని పిల్లలందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా పాపులర్. అంతేకాదు యావత్ దేశవ్యాప్తంగా ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఐదు పదుల వయసులోనూ ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

Tollywood : అప్పుడు కలిసి చదువుకున్నారు.. ఇప్పుడు ఇద్దరూ తోపు హీరోలు.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
Throwback Photos
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 9:32 PM

Share

అభిమానులు ఎల్లప్పుడూ సెలబ్రిటీల ఫోటోలను చూడటానికి, వారి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకే వారి చిన్ననాటి ఫోటోలు కూడా అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. అలాంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్కూల్ రోజుల నాటి చిత్రం. కానీ ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. హృతిక్‌తో పాటు ఇందులో మరో బాలీవుడ్ స్టార్ కూడా ఉన్నారు. ఆ నటుడు ఎవరనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం. అతడు మరెవరో కాదు ఆయనే జాన్ అబ్రహం. వీరిద్దరూ క్లాస్‌మేట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. వీరిద్దరూ బాంబే స్కాటిష్ స్కూల్‌లో విద్యార్థులుగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇది. జాన్ అబ్రహం ముంబైలో, అలువకు చెందిన మలయాళీ అయిన ఆర్కిటెక్ట్ జాన్, పార్సీ అయిన ఫర్హాన్ దంపతులకు జన్మించారు. ఆయన ముంబై స్కాటిష్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆయన ముంబై ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డిగ్రీని కూడా పూర్తి చేశారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

జాన్ మోడలింగ్ రంగం 2003లో ‘జిస్మ్’ చిత్రంతో చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అతని ముఖ్యమైన చిత్రాలలో ‘సాయా’, ‘పాప్’, ‘ధూమ్’, ‘కల్’, ‘గరం మసాలా’, ‘వాటర్’, ‘జిందా’, ‘టాక్సీ నెం. 921’, ‘బాబుల్’, ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’ , ‘పఠాన్’ చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

ఇక హృతిక్ విషయానికి వస్తే.. అతడి తండ్రి డైరెక్టర్ రాకేశ్ రోషన్. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన హృతిక్.. తర్వాత ‘కహో నా ప్యార్ హై’ చిత్రంలో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో తన నటనకు గాను, హృతిక్ ఉత్తమ నటుడు, ఉత్తమ తొలి నటుడు విభాగాలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ‘కోయి మిల్ గయా’ (2003), ‘క్రిష్’ (2006) , ‘ధూమ్ 2’ (2006) వంటి చిత్రాలతో హృతిక్ బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించాడు. ఇటీవల హృతిక్ ‘జైలర్ 2’ చిత్రంలో కూడా నటించాడు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

జాన్ అబ్రహం, హృతిక్ రోషన్:

John Abraham, Hrithik Rosha

John Abraham, Hrithik Rosha

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us