AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్

Sharwanand: వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 9:54 PM

Share

వరుసగా విభిన్న జానర్లలో సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఇప్పుడు మైథలాజికల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సంపత్ నంది ‘భోగి’, శ్రీను వైట్ల చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన, అభిషేక్ నామా దర్శకత్వంలో భారీ విజువల్ వండర్‌కు సిద్ధమవుతున్నారని సమాచారం. ‘నాగబంధం’ కంటే అధిక బడ్జెట్, అత్యాధునిక VFXతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫ్యామిలీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, కామెడీ అంటూ వరుస జోనర్స్‌తో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న శర్వానంద్.. ఈసారి మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నారా..? సంపత్ నంది, శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్లతో పని చేస్తున్న ఈ హీరో.. తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకు ఓకే చెప్పారా..? ఈ మధ్యే ఓ పెద్ద సినిమా చేసిన దర్శకుడితో విజువల్ వండర్ చేయబోతున్నారా..? అసలు శర్వా చేయబోయే ఆ సినిమా ఏంటి..? నారినారి నడుమ మురారి తర్వాత మళ్లీ బిజీ అయిపోయారు శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పీరియడ్ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు.. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నపుడే శ్రీను వైట్లతో మరో సినిమాను ఓకే చేసి పట్టాలెక్కించారు. భోగి ఆగస్ట్ 28న వస్తుంటే.. శ్రీను వైట్ల సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండింటి షూట్స్ వేగంగా జరుగుతున్నాయి. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి కాకముందే అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ సినిమాకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ మధ్యే నాగబంధంతో వచ్చారు నామా. ఈ సినిమా నిరాశపరిచినా విజువల్ పరంగా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతమైన VFX మ్యాజిక్ క్రియేట్ చేయడంలో అభిషేక్ నామా సక్సెస్ అయ్యారు. ఈ నమ్మకంతోనే అభిషేక్ నామా చెప్పిన మైథలాజికల్ సబ్జెక్ట్‌కు శర్వానంద్ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతుంది. నాగబంధం సినిమాతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకాస్త భారీ బడ్జెట్‌తో పాటు హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో తెరపైకి రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

Follow Us