AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయలేనని.. కన్న బిడ్డనే కడతేర్చాడు

ఎన్నికల్లో పోటీ చేయాలనే కాంక్షతో ఓ కిరాతక తండ్రి కన్న కూతురునే బలిచేశాడు. ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్‌ పదవికి అనర్హత అనే నిబంధన మహారాష్ట్రలో అమలులో ఉండటంతో, అడ్డంకి తొలగించుకోవడానికి చిన్నారిని హత్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన నిందితుడు తన కూతురిని నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు వద్ద నిజాంసాగర్‌ డీ–46 కెనాల్‌లో తోసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Nizamabad: ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయలేనని.. కన్న బిడ్డనే కడతేర్చాడు
Prachy
Diwakar P
| Edited By: |

Updated on: Feb 02, 2026 | 5:31 PM

Share

ఎన్నికల్లో పోటీ చేయాలనే వ్యామోహంతో కన్న కూతురును కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. ఊరికి వెళ్దామని ఆ కిరాతక తండ్రి చెప్పిన మాటలను నమ్మి సంబరంగా తండ్రి వెంట వెళ్లిన చిన్నారిని.. కొంచెం అయినా కనికరం లేకుండా కిరాతకంగా హత్యచేశాడు. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు అనే నిబంధన తెలంగాణలో ఎత్తేసినా పక్కనే ఉన్న మహారాష్ట్రలో అమలులో ఉంది. దీంతో మహారాష్ట్రకు చెందిన ఆ కిరాతకుడు సర్పంచ్‌గా పోటీచేసేందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారిని నిజామాబాద్ జిల్లాలోని ఏఆర్పీ క్యాంపు వద్ద కెనాల్‌లో తోసేసి హతమార్చాడు.

వివరాల్లోకి వెళ్తే..  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్ డీ 46 కెనాల్లో జనవరి 30 న ఓ బాలిక మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మూడు టీంలు నిందితుల కోసం గాలించింది.. బాలికను మహారాష్ట్రలోని ముఖేడ్‌కు చెందిన ప్రాచి కొండమంగలేగా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. విచారణలో బాలికను కన్న తండ్రే హతమార్చినట్లు గుర్తించారు. ముఖేడ్ తాలూకాలోని కెరుర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగ సెలూన్ నడుపుతూ భార్య ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరుర్ సర్పంచ్‌గా పోటీ చేయాలనే భావించాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉండడంతో పోటీకి అనర్హుడిని అవుతానని అనుకున్నాడు. దీంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్‌తో కలిసి పథకం వేశారు. ముగ్గురు పిల్లల్లో ఒకరైన బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు. కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికెట్ ఉందని నిర్ధారించుకున్నారు. దీనికి గాను పుణె కార్పొరేషన్ ఆఫీసు వెళ్లి బర్త్ సర్టిఫికెట్ మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ బర్త్ సర్టిఫికెట్ మారదని తెలిసిన తరువాత.. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా పెద్ద కూతురు ప్రాచీని అతని తండ్రి తన బైక్‌పై ఎక్కించుకుని వచ్చి నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్ డీ 46 కెనాల్‌లో బాలికను తోసేశాడు. దీంతో చిన్నారి మృతి చెందింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..