వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ ప్రయోజనాలు, జాగ్రత్తలు తెలుసుకోండి!

31 July  2026

Jyothi Gadda

వర్షాకాలంలో శారీరక శ్రమ తగ్గి జీర్ణశక్తి మందగిస్తుంది. మజ్జిగలో పుష్కలంగా ఉండే ప్రోబయోటిక్స్ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

శరీర డీటాక్సిఫికేషన్: మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ హానికర బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను (విషపదార్థాలను) బయటకు పంపి, జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

పోషకాల గని: మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి వర్షాకాలంలో శరీరాన్ని నీరసపడకుండా ఉంచి, ఎనర్జీని ఇస్తాయి.

వర్షాకాలంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మజ్జిగ తాగకూడదు. దీనివల్ల గొంతు నొప్పి, జలుబు, కఫం వంటి సమస్యలు రావచ్చు. ఉదయం టిఫిన్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనంతో పాటు తీసుకోవడం సురక్షితం.

వర్షాకాలంలో చల్లని మజ్జిగ తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచినది లేదా ఐస్ ముక్కలు కలిపిన మజ్జిగను కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న తాజా మజ్జిగనే తాగాలి.

పుల్లటి మజ్జిగ వద్దు.  బాగా నిల్వ ఉండి పులిసిపోయిన మజ్జిగను వర్షాకాలంలో తీసుకోకూడదు. ఇది ఎసిడిటీని పెంచుతుంది.

మసాలాలు చేర్చండి.. మజ్జిగలో కొద్దిగా అల్లం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కరివేపాకు కలిపి తీసుకుంటే జీర్ణశక్తి రెట్టింపు అవుతుంది.

వర్షాకాలంలో మజ్జిగను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. తాజా మజ్జిగను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.