AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!

నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చేందుకు వినూత్నంగా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని విలువైన బంగారు రాళ్లుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Watch: ఇలా తయారయ్యారేంట్రా..  బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
Coated Stones With Gold Color
Balaraju Goud
|

Updated on: Jul 31, 2026 | 1:23 PM

Share

నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చేందుకు వినూత్నంగా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని విలువైన బంగారు రాళ్లుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్‌కు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చాలాకాలంగా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో రమేష్ పలుమార్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో అప్పు తీర్చేందుకు మార్గం లేక శ్రీనివాస్ కొత్త కథ అల్లాడు. తనకు గుప్తనిధి దొరికిందని, అందులో బంగారు రాళ్లు లభించాయని, వాటిని అప్పుకు బదులుగా ఇస్తానని రమేష్‌ను నమ్మించాడు.

అంతేకాకుండా, ఆ బంగారు రాళ్లను తీసుకురావాలంటే డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌కు రావాలని, మరో రూ.32 వేల నగదు తీసుకురావాలని సూచించాడు. శ్రీనివాస్ మాటలు నమ్మిన రమేష్ అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లి రూ.32 వేలు అందజేశాడు. అనంతరం శ్రీనివాస్ నాలుగు బంగారు రాళ్లుగా చెప్పిన వస్తువులను రమేష్‌కు ఇచ్చాడు. అయితే వాటిని పరిశీలించిన రమేష్‌కు అనుమానం రావడంతో దగ్గరగా పరిశీలించగా అవి అసలు బంగారం కాదని, సాధారణ కంకర రాళ్లపై బంగారం రంగు పూత పూసినట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రమేష్ వెంటనే డిచ్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాస్‌ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు గుప్తనిధులు, బంగారు వస్తువుల పేరుతో చేసే ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర