Vegetable Prices: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్ రేట్లు ఇవే!
ఈ వానాకాలం సీజన్‌లో వర్షాలు సరిగ్గా కురువగా, ఉత్పత్తి తగ్గి ఇప్పటికే అనేక రకాల నిత్యావసరాల ధరలు పెరిగిన విషయం అందిరికి తెలిసిందే ఇటీవల ఈ ఎఫెక్ట్ కూరగాయలపై కూడా కనిపిస్తోంది. వర్షాలు లేక పోవడంతో సాగుతగ్గి కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన కూరగాయలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టి జనాలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మార్కెట్‌లో కూరగయాలు ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్, కూకట్‌పల్లి : ఇటీవల వర్షాలు తగ్గి సాగు లేకపోవడంతో ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ కూరగాయల మార్కెట్‌కు సరుకు రావడం స్టార్ట్ అయింది. దీంతో సరఫరా పెరిగి కూరగాయల ధరలు సాధారణ స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాద్‌లోని కూకట్‌పల్లిలో మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎస్టేట్ ఆఫీసర్ వెల్లడించిన ధరల పట్టిక ప్రకారం.. నిత్యం ఉపయోగించే టమాటా, బంగాళాదుంప, ఉల్లిగడ్డల ధరలు సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి.
ముఖ్యమైన కూరగాయల ధరల వివరాలు
ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతు బజార్‌లో టమాటా కిలో రూ.16, ఆలుగడ్డ కిలో రూ.18గా విక్రయిస్తున్నారు. అలాగే ఉల్లిపాయ కేజీ రూ.32, క్యాబేజీ రూ.15, కేజీ వంకాయను రూ.23కు విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయలు లభిస్తుండటంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరుకుల లభ్యత సమృద్ధిగా ఉందని అధికార్లు తెలిపారు.
కూకట్‌పల్లి మార్కెట్‌లో ఇతర కూరగాయల ధరలు
బెండకాయ: రూ 35
పచ్చి మిర్చి:రూ.35
క్యారెట్:రూ.42
కాకరకాయ:రూ.32
బీరకాయ:రూ.38
దోసకాయ:రూ.16
సొరకాయ:రూ.15
అధిక ధరలు ఉన్న కూరగాయలు:
అయితే మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయల ధరలు ఒకేలా లేవు కొన్ని రకాల దినుసులు, ప్రత్యేక కూరగాయల ధరలు కాస్త ఎక్కువగా నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.
ఫ్రెంచ్ బీన్స్:రూ.85
ఆ కాకరకాయ : రూ.140
వెల్లుల్లి :రూ.260
ఎండు మిర్చి:రూ.260
అల్లం :రూ.220
చింతపండు:రూ.160
గమనిక: అయితే అన్ని ప్రాంతాల్లో ఈ ధరలు ఒకేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే రైతు బజార్‌లలో నేరుగా రైతుల నుంచి కూరగాయలు విక్రయించబడటం వల్ల మార్కెట్‌తో పోలిస్తే కొంత తక్కువ ధరలకు కూరగాయలు దొరుకుతాయి. అయితే సరఫరా, డిమాండ్‌ను బట్టి ఎప్పికప్పుడూ ధరల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి కొనే ముందు తాజా ధరలను ఒకసారి చెక్ చేసుకోండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
