కొత్తిమీర ఇది లేకుంటే వంటలకే టేస్టే ఉండదు.. ఇది కేవలం రుచికి మాత్రమే కారు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఇదన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలో చూద్దాం.
కొత్తమీర ప్రాముఖ్యత
ఇంట్లో కొత్తమీర పెంచడానికి కనీసం 6 నుండి 8 అంగుళాల లోతు, బాగా వెడల్పుగా ఉన్న ఓ మంచి కుండీని మార్కెట్ నుంచి తెచ్చుకోండి.
సరైన కుండీ
ఇప్పుడు కుండీలో కాస్త మట్టి నింపి అందులో కాస్త ఎరువు లేదా వర్మీకంపోస్ట్, కొంత కొబ్బరి పొట్టు వేసి బాగా కలపండి.
మట్టి మిశ్రమం
మార్కెట్‌లో మంచి క్వాలిటీ ఉన్న ధనియాలను తీసుకొచ్చి. విత్తనాలు దెబ్బతినకుండా, ఆరోగ్యంగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
నాణ్యమైన విత్తనాలు
ధనియాలను ఒక సమతల ఉపరితలంపై ఉంచి లఘువుగా ఒత్తిడి ఇస్తూ, రెండు ముక్కలుగా విడదీయండి.
రెండుగా విడదీయడం
ఈ విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి, మట్టిపై చల్లండి లేదా నాటండి
రాత్రంతా నానబెట్టడం
విత్తనాలు నాటిన తర్వాత వాటర్ స్ప్రేయర్ ద్వారా తేలికగా నీరు చల్లుతూ.. ఎండ తగిలే చోట కుండీని ఉంచండి.
నీరు, ఎండ
సరైన సంరక్షణ ఉంటే 10 నుండి 15 రోజుల్లో మొలకలు వస్తాయి. 3 వారాల్లో మీ ఇంట్లోనే తాజా, ఆర్గానిక్ కొత్తమీర రెడీ అవుతుంది దాన్ని మీరు కోసుకోని కూరల్లో వాడుకోవచ్చు.