AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SVRR GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్ తదితర..

SVRR GGH Jobs 2026: పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు
Tirupati SVRR GGH Hospital Jobs
Srilakshmi C
|

Updated on: Mar 04, 2026 | 5:00 PM

Share

తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ పోస్టుల సంఖ్య: 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 1
  • పీర్ ఎడ్యుకేటర్ పోస్టుల సంఖ్య: 1
  • వార్డ్ బాయ్ పోస్టుల సంఖ్య: 1
  • యోగా థెరపిస్ట్/డ్యాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్ పోస్టుల సంఖ్య: 1
  • చౌకీదార్‌ పోస్టుల సంఖ్య: 2
  • హౌస్ కీపింగ్ వర్కర్ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, డిప్లొమా, డిడిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది చిరునామాలో మార్చి 7, 2026వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులకు 250, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

చిరునామా

అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ) సూపరింటెండెంట్ కార్యాలయం, ఎస్‌వీఆర్ఆర్‌ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి.

ఇవి కూడా చదవండి

తిరుపతి డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌ ఉద్యోగాల దరఖాస్తు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us