AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బిడ్డ లగ్గం కూడా చేయలేకుంటినే.. ఆవేదనతో తండ్రి ఆత్మహత్య..

అతనికి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమార్తెకు ఉన్న పొలం అమ్మి పెళ్లి చేశాడు.. పెళ్లిడుకొచ్చిన మరో కూతురు ఉంది.. దీంతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.. చిన్న కుమార్తెకు పెళ్లి చేయలేకపోతున్నాననే బాధతో కుమిలిపోయాడు.. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు..

Telangana: బిడ్డ లగ్గం కూడా చేయలేకుంటినే.. ఆవేదనతో తండ్రి ఆత్మహత్య..
Crime News
Diwakar P
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 1:09 PM

Share

అతనికి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమార్తెకు ఉన్న పొలం అమ్మి పెళ్లి చేశాడు.. పెళ్లిడుకొచ్చిన మరో కూతురు ఉంది.. దీంతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.. చిన్న కుమార్తెకు పెళ్లి చేయలేకపోతున్నాననే బాధతో కుమిలిపోయాడు.. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.. ఈ విషాద ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.. కుమార్తెకు వివాహం చేయలేక పోతున్నాననే ఆవేదనతో ఓ తండ్రి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చీట్టి వీరయ్య మృతుడు (65) దినసరి కూలీగా పనిచేసేవాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రజనీ పెళ్లి కోసం ఉన్న కాస్త పొలం అమ్మి గతంలోనే వివాహం జరిపించాడు. ప్రస్తుతం భార్య అనుష మృతుడు కూలిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో జీవనాన్ని కొనసాగిస్తూన్నారు. రెండో కుమార్తె డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్ద ఉంటుంది.. దీంతో ఆమెకు వివాహం చేయలేకపోతున్నానని వీరయ్య నిత్యం బాధపడుతూ ఉండేవాడు.. ఇదే విషయం గురించే నిత్యం ఆలోచిస్తూ.. కుమిలిపోయేవాడు.. దీనికితోడు అతడు కొన్ని నెలలుగా ఆస్తమాతో బాధపడుతుండటంతో జీవితంపై విరక్తి చెందాడు..

ఈ క్రమంలోనే.. మంగళవారం మధ్యాహ్నం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆయన కోసం గాలించగా.. గ్రామ శివారులో విగతజీవిగా కనిపించాడు.. సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చూసుకున్నాడు..

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య అనూషవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..