AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SM PORT Jobs 2026: నెలకు రూ.1,60 వేల జీతంతో.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లో అప్రెంటిస్ డాక్ పైలట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు అప్రెంటిస్‌ డాక్‌ పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు..

SM PORT Jobs 2026: నెలకు రూ.1,60 వేల జీతంతో.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు
Syama Prasad Mookerjee Port Jobs
Srilakshmi C
|

Updated on: Mar 04, 2026 | 4:37 PM

Share

శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ పరిధిలోని హల్దియా డాక్ కాంప్లెక్స్‌లోని మెరైన్ ఆపరేషన్స్ విభాగంలో ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అప్రెంటిస్ డాక్ పైలట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు అప్రెంటిస్‌ డాక్‌ పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సెకండ్‌ మేట్‌ ఎఫ్‌జీ సర్టిఫికెట్ లేదా 60 శాతం మార్కులతో నాటికల్ సైన్స్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 1, 2026 నాటికి 25 ఏళ్లకు మించకుండా ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఇతర మేజర్ పోర్టుల ఉద్యోగులకు 55 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఏప్రిల్ 17, 2026వ తేదీలోపు ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. వెబ్‌సైల్‌ నుంచి నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి చేసి, అవసరమైన Self-attested సర్టిఫికెట్లను జత చేసి సీల్ చేసిన కవర్‌లో Application for recruitment of Apprentice Dock Pilot under HDC అని రాసి పోస్టులో పంపించాలి.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది కాలం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు రూ.40,000 చొప్పున స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని నెలకు రూ.50,000 నుంచి 1,60,000 వరకు జీతంతో రెగ్యులర్ డాక్ పైలట్లుగా నియమిస్తారు.

ఇవి కూడా చదవండి

అడ్రస్:

Sr. Dy. Manager (P&IR), Haldia Dock Complex, Jawahar Tower, P.O.: Haldia Township, Dist.: Purba Medinipur, W.B. PIN: 721607.

ఎస్‌ఎం పోర్టులో అప్రెంటిస్ డాక్ పైలట్ పోస్టుల అప్లికేషన్‌ ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us