AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్-వరంగల్ రోడ్డుపై కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళ్లగా..

జనగామ జిల్లాలో అరుదైన బార్న్ గుడ్లగూబ (టైటో ఆల్బా) ప్రత్యక్షమైంది. హైదరాబాద్-వరంగల్ రహదారిపై అనారోగ్యంతో ఉన్న ఈ పక్షిని బాటసారులు గుర్తించి, జనగామ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పక్షిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. గోధుమ వర్ణంలో, గుండె ఆకారపు ముఖంతో కనిపించిన ఈ అరుదైన గుడ్లగూబను స్థానికులు రంక్షించడంపై పలువురు అభినందిస్తున్నారు.

హైదరాబాద్-వరంగల్ రోడ్డుపై కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళ్లగా..
Rare Barn Owl Rescued in Jangaon
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 2:30 PM

Share

జనగామ జిల్లాలో అరుదైన జాతి గుడ్లగూబ ప్రత్యక్షమైంది. ఎక్కడి నుండి వచ్చిందో.. ఏమో తెలియదు.. కానీ.. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారుల కంటపడింది. అనారోగ్యంతో అవస్థ పడుతున్న ఆ గుడ్లగూబను బాటసారులు చేరదీసి.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. గోధుమ వర్ణంలో మెరుస్తున్న ఈ గుడ్లగూబని చూసి బాటసారులు అవాక్కయ్యారు.. ఇలాంటి గుడ్లగూబను ఈ పరిసరాల్లో ఎక్కడా చూడలేదని.. ఇది అరుదైనదని భావించి.. వెంటనే అప్రమత్తమయ్యారు.. దానిని చేరదీసి ఓ బాక్స్ లో భద్రపరిచి అక్కడి నుండి నేరుగా జనగామ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

బాటసారులు బాధ్యతగా ఈ అరుదైన పక్షిని పోలీసులకు అప్పగించారు.. పోలీసులు ఈ విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు తెలపడంతో వారు వెంటనే వచ్చి పక్షి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే.. ఈ పక్షి గుండె ఆకారం బంగారం, తెలుపు వర్ణంతో కూడి ఆకర్షణంగా ఉంది. ఇది “ఈ బార్న్ ఓవల్ ” జాతికి చెందిన గుడ్లగూబ గా గుర్తించారు.. ఈ గుడ్లగూబ టైటో ఆల్బా శాస్త్రీయ నామంగా పిలుస్తారని, ఈ పక్షి చాలా అరుదుగా కనిపిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us