AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Results 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మరికొన్ని గంటల్లో ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే

ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2026 రేపు విడుదల కానున్నాయి. బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటన వెలువరించారు.

AP Inter Results 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మరికొన్ని గంటల్లో ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే
AP Inter Results
Srilakshmi C
|

Updated on: Apr 14, 2026 | 9:44 PM

Share

అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2026 రేపు విడుదల కానున్నాయి. బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటన వెలువరించారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు అధికారిక వెబ్ సైట్ లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే, వాట్సప్‌లోనూ (9552300009) ఫలితాలు పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2026 తాజా అప్ డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Ap Inter Results

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. అలాగే వాట్సప్‌లోనూ 9552300009 ఫలితాలు పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు. మనమిత్ర వాట్సప్‌ నెంబర్‌కు Hi అని మెసేజ్‌ పంపితే అక్కడ వచ్చిన ఆప్షన్‌లను సెలక్ట్ చేసుకోవాలి. అంతే క్షణాల్లో ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ 2026 పరీక్షల ఫలితాలకు సంబంధించిన ఇతర అప్ డేట్ లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టీవీ9 తెలుగు వెబ్ సైట్ ను సందర్శించండి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2026 తాజా అప్ డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us