AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పన్నెండు రోజుల పసిబిడ్డతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన యువతి.. ఖంగుతిన్న పోలీసులు..!

సోషల్ మీడియా ద్వారా పరిచయం.. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియురాలు గర్భం దాల్చడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. యువతి తల్లిదండ్రులు వెళ్లి ప్రశ్నిస్తే కులాలు వేరని, పెళ్లి కుదరదని అబ్బాయి బంధువులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ యువతి పోలీసులు గడప తొక్కింది.

పన్నెండు రోజుల పసిబిడ్డతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన యువతి.. ఖంగుతిన్న పోలీసులు..!
Woman Complaint To Sp
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 5:33 PM

Share

సోషల్ మీడియా ద్వారా పరిచయం.. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియురాలు గర్భం దాల్చడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. యువతి తల్లిదండ్రులు వెళ్లి ప్రశ్నిస్తే కులాలు వేరని, పెళ్లి కుదరదని అబ్బాయి బంధువులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ యువతి పోలీసులు గడప తొక్కింది.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురానికి చెందిన యువతి ఇంటర్ వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటుంది. 2024లో కాకినాడ జిల్లా మామిడాల గ్రామానికి చెందిన సాయిక్రిష్ణతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. 2025 జూన్ లో తన స్నేహితుడి రూమ్‌కు తీసుకెళ్లిన సాయిక్రిష్ణ ఆమెకు పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఆగష్టు నెలలో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న సాయిక్రిష్ణ ముఖం చాటేశాడు. యువతి ఫోన్ నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టి మాట్లాడటం మానేశాడు. దీంతో ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లిదండ్రులు మామిడాల గ్రామానికి వెళ్లి జరిగింది చెప్పి పెళ్లి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సాయిక్రిష్ణతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కులాలు వేరని పెళ్లి చేయడం కుదరదని సాయిక్రిష్ణ తల్లిదండ్రులు అంటే… ఆ గర్బం తన వల్ల రాలేదని సాయి క్రిష్ణ అన్నాడు.

ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే యువతికి నిండు నెలల నిండాయి. గత నెలలో ప్రత్తిపాడు పిఎస్ సాయిక్రిష్ణపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే పన్నెండు రోజుల క్రితం యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాము ఫిర్యాదు చేసిన ప్రత్తిపాడు పోలీసులు స్పందించకపోవడంతో నిన్న ఎస్పీ గ్రీవెన్స్ కు పసిబిడ్డతో వచ్చిన యువతి తనకు జరిగిన విషయాన్ని చెప్పుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. సత్వరమే స్పందించిన డిఎస్పీ శ్రీనివాసరావు వెంటనే సాయిక్రిష్ణ ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పెల్లికి ఒప్పుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!