ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ
ఖమ్మం జిల్లా వైరాలో ఓ పిచ్చుక ఎండల తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు వినూత్నంగా స్కూటీని తన ఆవాసంగా మార్చుకుంది. నెల రోజులుగా కదలకుండా ఉన్న వాహనంలోని చిన్న ఖాళీ ప్రదేశంలో గూడు కట్టుకుని గుడ్లు పెట్టింది. ఈ విషయం గమనించిన స్థానికులు పిచ్చుక తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకునేందుకు అది చూపిన సమయస్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంటోంది.
సాధారణంగా పక్షులు ఇంటి చూరులోనో.. ఇంటిఆవరణలోని చెట్లపైనో..లేదంటే ఇళ్ల షేడ్ పైనో గూళ్లు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఓ పిచ్చుక వినూత్నంగా ఆలోచించింది. వేసవి కాలం కావడంతో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. వడగాలులకు జనాలు అల్లాడిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే, పక్షులు, జంతువుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ క్రమంలో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి ఓ పిచ్చుక చేసిన పని స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని లీలాసుందరయ్యనగర్‌లో నివసించే ఒక కుటుంబం వేసవి సెలవుల కారణంగా తమ స్కూటీని ఇంటి ఆవరణలోనే పార్క్ చేసి స్వస్థలాలకు వెళ్లారు. నెల రోజులుగా ఆ వాహనాన్ని ఎవరూ కదిలించకపోవడంతో, ఓ పిచ్చుక ఆస్కూటీని తన ఆవాసంగా మార్చుకుంది. ఎండల తీవ్రత, వడగాలులకు చెట్లపై సైతం తలదాచుకోలేకపోయిన ఆ పిచ్చుక సురక్షితమైన స్థావరం కోసం వెతికింది. స్కూటీకి తాళం పెట్టే అమరికకు ఎడమ వైపున ఉండే చిన్న బాక్స్‌ను తన రక్షణ కవచంగా ఎంచుకుంది. అక్కడ ఎంతో చాకచక్యంగా గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు కూడా పెట్టింది. బైక్ వద్దకు పిచ్చుకలు తరచూ రాకపోకలు సాగిస్తుండటాన్ని గమనించిన పొరుగువారు స్కూటీని పరిశీలించగా.. అందులో గూడు, గుడ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పిచ్చుక చూపిన ఈ సమయస్ఫూర్తిని, తెలివితేటలను స్థానికులు ఎంతో ఆసక్తిగా చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
నెలకు రూ.90 వేల జీతం.. నెలవారీ ఖర్చు రూ.25 వేలు.. రూ.65 వేలు ఆదా.. ఈ ప్లాన్ చూడండి!
Upasana Konidela: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్..
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

