ముంబయి వీధుల్లో అడుక్కుంటూ.. అత్యంత దీనస్థితిలో నటి..!
ఒకప్పుడు భోజ్‌పురి చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న మితాలీ శర్మ ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితిలో జీవిస్తోంది. ముంబయి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించిన ఆమెను పోలీసులు గుర్తించి సంరక్షణలోకి తీసుకున్నారు. ఆహారం, వైద్య సహాయం అందించిన అనంతరం మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి చూసి సినీ అభిమానులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఆశలతో.. స్టార్ హీరోయిన్ అవ్వాలని సినిమాల్లోకి వచ్చిన ఓ నటి ఇప్పుడు అత్యంత దీన స్థితిలో బతుకీడుస్తోంది. తినడానికి తిండి లేక… ముంబయి వీధుల్లో అడుక్కుంటోంది. గతాన్ని మరవలేక… ప్రస్తుతాన్ని గ్రహించలేక.. మానసికంగా కృంగిపోయి కాలం వెళ్లదీస్తోంది! ఆమె… ప్రముఖ భోజ్ పురి నటి మితాలీ శర్మ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎదిగిన మితాలీ శర్మ.. ప్రస్తుతం ముంబయిలోని లోఖండ్ వాలా వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో చేసేదేమి లేక జీవన పోరాటం మొదలెట్టింది. మితాలీకి తన కుటుంబంతో సంబంధాలు క్రమంగా తెగిపోయినట్టు తెలుస్తోంది. పనిలేకపోవడం, మరోవైపు కుటుంబ మద్దతు లేకపోవడంతో ఆమె ఒంటరితనానికి గురైంది. నిరంతర వైఫల్యాలు, తిరస్కరణలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. ఇక అత్యంత దీనస్థితిలో ఉన్న మితాలీని గుర్తించిన పోలీసులు ఆమెను సంరక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత మిథాలీకి ఆహారం అందించారు. ఆమెకు వెంటనే అవసరమైన వైద్య చికిత్స అందించారు. ఆమె మానసిక పరిస్థితి క్షీణించండ వల్ల.. ప్రస్తుతం ఆమెను ఒక మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఒకప్పుడు తెరపై తన నటనతో అందర్నీ మెప్పించిన నటి.. ఇప్పుడు వీధిలో ధీన స్థితిలో కనిపించడంతో… ఆమెను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పని మనిషి టోకరా.. నమ్మించి ఇల్లు దోచేసింది!
Blast Zone: బ్లాస్ట్ జోన్ మూవీ సైలెంట్ సెన్సేషన్.. చిన్న సినిమా పెద్ద బ్లాస్ట్
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

