AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blast Zone: బ్లాస్ట్‌ జోన్‌ మూవీ సైలెంట్ సెన్సేషన్.. చిన్న సినిమా పెద్ద బ్లాస్ట్

Blast Zone: బ్లాస్ట్‌ జోన్‌ మూవీ సైలెంట్ సెన్సేషన్.. చిన్న సినిమా పెద్ద బ్లాస్ట్

Phani CH
|

Updated on: Jun 04, 2026 | 12:27 PM

Share

అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బ్లాస్ట్ జోన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుంటోంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మౌత్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కరాటే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కంటెంట్ ఉంటే చాలు.. ప్రమోషన్స్ తగ్గినా పర్లేదు.. కొన్ని సినిమాలు హిట్ అయిపోతుంటాయి. మౌత్‌ టాక్‌ తోనే కలెక్షన్స్‌ను కొల్లగొడుతుంటాయి. మంచి థియేట్రికల్ రన్ రేట్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంటాయి. ఇప్పుడు బ్లాస్ట్ జోన్ సినిమా కూడా అదే చేస్తోంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా సర్‌ప్రైజింగ్‌లీ మంచి కలెక్షన్స్‌ను సాధిస్తోంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. యాక్షన్ హీరో అర్జున్, ఒకప్పటి హీరోయిన్ అభిరామి, ఇప్పటి బ్యూటీ ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్‌ లో చేసిన సినిమా బ్లాస్ట్ జోన్. సుభాష్‌ కే రాజు డైరెక్షన్లో తమిళ్లో తెరకెక్కిన ఈ మూవీ.. అక్కడ బ్లాస్ట్ పేరుతో రిలీజ్ అయింది. మే 28న రిలీజ్ అయిన ఈ మూవీ… తెలుగు, తమిళ్లో మంచి హిట్ టాకయ్ తెచ్చుకుంది. రిలీజ్ డే నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యప్తంగా దాదాపు 28 క్రోర్ గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే జస్ట్ 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్‌ వసూళ్లు సాధించడం సంచలనంగా మారిందిప్పుడు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. నీల అలియాస్ ప్రీతి ముకుందన్, ఆమె తండ్రి రాజారామ్ అలియాస్ అర్జున్, తల్లి అభిరామి ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్‌ అలియాస్ పవన్‌ గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్‌ తర్వాత కృపాకర్‌ గ్యాంగ్‌తో పాటు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అబ్రహం అలియాస్ అర్జున్‌ చిదంబరం.. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. కారణం అదేనా

కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం

ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!

ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది

Follow Us