వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
ఇటలీలోని పుంటా మెరీనా పట్టణంలో నెమళ్ల సంఖ్య భారీగా పెరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గుంపులుగా తిరగడం, కార్ల అద్దాలపై దాడులు చేయడం, రాత్రివేళల్లో పెద్దగా అరుస్తూ నిద్ర భంగం కలిగించడం ప్రజలను కలవరపెడుతోంది. ఒకే జంటతో ప్రారంభమైన నెమళ్ల సంఖ్య ప్రస్తుతం 150కి చేరినట్లు అంచనా. ఈ సమస్యపై పట్టణవాసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మన జాతీయ పక్షి, భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే నెమళ్లు.. ఒక దేశంలో మాత్రం అక్కడి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారాయి. ఇటలీలోని ‘పుంటా మెరీనా’ అనే చిన్న తీరప్రాంత పట్టణంలో వందలాది నెమళ్లు సృష్టిస్తున్న గందరగోళం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇవి రోడ్లపై గుంపులుగా తిరుగుతూ ట్రాఫిక్‌ను అడ్డుకోవడం, పార్క్ చేసిన కార్ల అద్దాలపై దాడి చేయడం, అర్ధరాత్రి వేళల్లో పెద్దగా అరుస్తూ నిద్ర లేకుండా చేస్తుండటంతో ప్రజలు విసిగిపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అడవి నుంచి తప్పించుకు వచ్చిన ఒకే ఒక్క నెమలితో ఈ సమస్య మొదలైంది. ఆ తర్వాత దానికి జతగా మరో నెమలిని తీసుకురావడంతో వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రజలు వీటికి రోజూ ఆహారం పెట్టడం, ఆ ప్రాంతంలో వీటిని వేటాడే క్రూర జంతువులు లేకపోవడంతో వీటి జనాభా అనూహ్యంగా పెరిగిపోయింది. 2023లో కేవలం 30గా ఉన్న నెమళ్ల సంఖ్య, ప్రస్తుతం 150కి చేరినట్లు అంచనా. ఈ నెమళ్ల విషయంలో పట్టణ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇవి పర్యాటక ఆకర్షణగా మారాయని చెప్తుండగా, బాధితులు మాత్రం వీటిని వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. జంతు సంక్షేమ సంస్థలు వీటిపై కఠిన చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. ఇక అధికారులేమో ‘నెమళ్లకు ఎవరూ ఆహారం పెట్టవద్దు’ అంటూ పట్టణమంతటా బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. ఇప్పుడు ఇటలీలో ఈ ఊరుదీ ఇదే సమస్య. నెమళ్లు ఎప్పుడు వెళతాయా అని ఊరి వాసులంతా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు రూ.90 వేల జీతం.. నెలవారీ ఖర్చు రూ.25 వేలు.. రూ.65 వేలు ఆదా.. ఈ ప్లాన్ చూడండి!
Upasana Konidela: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్..
Dhanush: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్..
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!

