పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెంలో పెద్దపులి సంచారం స్థానిక పశువుల కాపరులు, ప్రజలను కలవరపెడుతోంది. అడవి నుంచి వచ్చిన పులి ఆవుల మందపై దాడి చేసి 13 దూడలను దారుణంగా చంపేసింది. పులి కదలికలు పెరగడంతో అటవీ శాఖ అధికారులు గండి పోచమ్మ గుడి వైపు వెళ్లే రహదారిని మూసివేశారు. పులిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.