అనంతపురం జిల్లా గుత్తి జంక్షన్ సమీపంలో యశ్వంత్పూర్-కటిహార్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ నుంచి బోగీలు అకస్మాత్తుగా విడిపోయాయి. S-6, S-7 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ అప్రమత్తతతో వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అరగంట ఆలస్యం తర్వాత రైలు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.