AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్ బ్రోలకు గుడ్‌బై.. సైబర్‌డెక్‌లకు హాయ్! గ్యాడ్జెట్‌లను ఫ్యాషన్‌గా మార్చేస్తున్న జెన్‌జీ

టెక్ బ్రోలకు గుడ్‌బై.. సైబర్‌డెక్‌లకు హాయ్! గ్యాడ్జెట్‌లను ఫ్యాషన్‌గా మార్చేస్తున్న జెన్‌జీ

Phani CH
|

Updated on: Jun 04, 2026 | 1:07 PM

Share

టెక్ బ్రో స్టైల్‌కు భిన్నంగా జెన్‌జీ యువత కొత్త టెక్నాలజీ ట్రెండ్‌ను ప్రోత్సహిస్తోంది. సాదాసీదా గ్యాడ్జెట్‌లకు బదులుగా తమ అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసిన సైబర్‌డెక్‌లు, వింటేజ్ డివైజ్‌లను ఉపయోగిస్తోంది. టెక్నాలజీని కేవలం సాధనంగా కాకుండా కళ, ఫ్యాషన్, సెల్ఫ్-ఎక్స్‌ప్రెషన్‌గా మార్చుకుంటూ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతోంది.

సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే యువత.. తాము ధరించే దుస్తుల్లో, వాడే టెక్నాలజీలో డైనమిక్ లుక్స్ ఇష్టపడుతుంది. దీనినే టెక్ బ్రో ట్రెండ్ అని కూడా పిలుస్తారు. కానీ ఇటీవల ఇందుకు భిన్నంగా మరో కొత్త ట్రెండ్ ముందుకు వచ్చింది. ఒకప్పటిలా నలుపు లేదా గ్రే రంగుల్లో సింపుల్‌గా, హుందాగా ఉండే కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను, ఫోన్లను జెన్‌జీలు అంగీకరించడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ముందుంటున్నారు. తమకు నచ్చిన స్టైల్‌ను అనుసరించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే టెక్ బ్రో డివైజ్‌లను ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు తమ ఫోన్ లేదా లాప్‌టాప్, డెస్క్‌టాప్ సింపుల్‌గా, మినిమల్ డిజైన్‌తో ఉండటాన్ని అంతగా ఇష్టపడట్లేదు జెన్‌జీలు, ముఖ్యంగా అమ్మాయిలు. ఇలా ఉంటే.. ఫన్ లేదు. ఫ్యాషన్ లేదు అనేస్తున్నారు. అందుకే ప్లెయిన్ బ్లాక్ మ్యాక్‌బుక్, సాదా ఐఫోన్ కేస్, గ్రే ట్యాప్‌టాప్ వంటి వాటిని కొత్త హంగులతో తీర్చి దిద్దుకుంటున్నారు. అందుకే పింక్ ఐపాడ్స్, హై సాచురేషన్ గేమ్స్‌తో పెరిగిన ఆధునిక యువత తాము వాడే టెక్నాలజీని సైతం మరింత Do It Yourself‌, ఫన్, ఎక్స్‌ప్రెసివ్‌గా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్‌డెక్ అనే కస్టమ్-బిల్ట్ పోర్టబుల్ కంప్యూటర్లు పాపులర్ అవుతున్నాయి. వీటిని యూజర్ ఇంట్రెస్ట్, వర్క్‌ఫ్లో, ఇమాజినేషన్ ప్రకారం రూపొందిస్తున్నారు. ఇటీవల యువతులు ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. టెక్నాలజీని సైతం సొంత ఆసక్తులకు అనుగుణంగా కళగా, ఫ్యాషన్‌గా, సెల్ఫ్- ఎక్స్‌ప్రెషన్‌గా మార్చేస్తోందీ తరం. అందుకోసం సైబర్‌డెక్‌లు టెక్ వేస్ట్‌ను రీయూజ్ చేసి, హ్యాండ్‌క్రాఫ్టెడ్‌గానూ అసెంబుల్ చేస్తున్నారు. ఇవి ప్యూంక్, రెబెలియస్ స్టైల్‌ను ప్రతిబింబిస్తాయి. వీటిని ఆఫ్‌గ్రిడ్‌గా అంటే ఇంటర్నెట్ లేకుండా కూడా ఉపయోగించవచ్చు. యూత్ ఇప్పుడు వింటేజ్ టెక్నాలజీని సరికొత్త రూపంలో వాడేందుకు ఇష్టపడుతోంది. 5th జనరేషన్ ఐపాడ్‌లు, డబ్బా ఫోన్‌లు, సింగిల్-పర్పస్ డివైజ్‌ల వాడకం పెరుగుతోంది. ఎందుకిలా అంటే.. టెక్నాలజీని మళ్లీ ఆనందదాయకంగా, స్ట్రెస్‌లెస్‌గా ఉపయోగించుకోవాలన్నదే అసలు ఉద్దేశం. వ్యక్తిగత స్టైల్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే ట్రెండ్‌గా ఇది మారుతోంది. ఈ ఉద్యమం టెక్నాలజీని కేవలం టూల్‌గా కాకుండా, కళ, హాబీ, సెల్ఫ్-ఎక్స్‌ప్రెషన్‌గా మారుస్తోంది. అంటే టెక్నాలజీ ఇక బోరింగ్ గాడ్జెట్ కాదు. యూత్ సృజనాత్మకతను చూపించే ఫన్ ఎలిమెంట్ కూడా!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ

వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

నెలకు రూ.90 వేల జీతం.. నెలవారీ ఖర్చు రూ.25 వేలు.. రూ.65 వేలు ఆదా.. ఈ ప్లాన్ చూడండి!

Upasana Konidela: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Dhanush: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్..

Follow Us