AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?

Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?

Phani CH
|

Updated on: Jun 04, 2026 | 4:07 PM

Share

దేశంలో వెండి దిగుమతులు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. గ్రెయిన్, పొడి రూపాల్లోని వెండి దిగుమతులను నిషేధిత జాబితాలో చేర్చి, ముందస్తు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనలతో వెండి దిగుమతి ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.

దేశంలోకి వెండి దిగుమతులు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వెండి దిగుమతులపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా గ్రెయిన్, పొడి రూపాల్లో ఉన్న వెండి దిగుమతిని నిషేధిత జాబితాలోకి చేర్చింది. పొడి, గ్రెయిన్ రూపాల్లో భద్రపరిచే కేటగిరీ కిందకు తీసుకురావడంతో పాటు, దిగుమతిదారులు ముందస్తు ప్రభుత్వ అనుమతి పొందాలని కూడా ఆదేశించింది. వెండి దిగుమతులకు తప్పనిసరిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనుమతి ఉండాలని కేంద్రం తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత గల వెండి ఉన్న గ్రెయిన్, పొడి, ఇతర రూపాల్లోని వెండి వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ దిగుమతులు 157% పెరిగి 411 మిలియన్ డాలర్లకు చేరాయి. ఈ పరిణామం రూపాయి విలువ, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుండి 15%కి పెంచింది. భారత్‌లో ఆభరణాలతో పాటు సోలార్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు, సిల్వర్ ఈటీఎఫ్‌ల పెట్టుబడులకు వెండి వినియోగం ఎక్కువ. తాజా ఆంక్షలతో అనుమతులు ఎప్పుడు వస్తాయో తెలియక దిగుమతి మరింత కష్టతరం అవుతుందని బులియన్ మార్కెట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రధానంగా యూఏఈ, బ్రిటన్, చైనా దేశాల నుండి వెండిని దిగుమతి చేసుకుంటోంది. ఇక.. బుధవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోల్చితే.. కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ

వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

నెలకు రూ.90 వేల జీతం.. నెలవారీ ఖర్చు రూ.25 వేలు.. రూ.65 వేలు ఆదా.. ఈ ప్లాన్ చూడండి!

Upasana Konidela: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Dhanush: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్..

Follow Us