AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? కొన్ని రోజులు ఆగాల్సిందే.. సడెన్ షాక్..

గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్‌ఓఎఫ్‌లలో భారీ పెట్టుబడులపై హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ కీలక ఆంక్షలు విధించింది. తాత్కాలిక ఆంక్షలను విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాల వరకు అమల్లో ఉండనున్నాయి.

Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? కొన్ని రోజులు ఆగాల్సిందే.. సడెన్ షాక్..
Gold
Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 8:49 PM

Share

ఇండియాలో బంగారాన్ని ఒక ఆభరణంగానే కాకుండా ఒక పెట్టుబడిగా కూడా పరిగణిస్తారు. ఒక ఆస్తిగా దీనిని భావిస్తారు. దీంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడమే కాకుండా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. డిజిటల్ రూపంలో ఇటీవల బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైపోయింది. స్టాక్ మార్కెట్లు, మ్యూచవల్ ఫండ్స్, బాండ్ల రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ రూపంలో గోల్డ్‌పై పెట్టుబడి పెట్టేవారికి హెచ్‌డీఎఫ్‌సీ షాకిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తన గోల్డ్ ఈటీఎఫ్‌తో పాటు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లలో ఒకేసారి లంప్సమ్‌గా పెట్టుబడులు పెట్టడంపై తాత్కాలికంగా పలు ఆంక్షలు విధించింది. గురువారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానుండగా.. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఇవి వర్తిస్తాయని తెలిపింది.

గోల్డ్ ఈటీఎఫ్‌లపై పరిమితులు

విస్తృత ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు HDFC గోల్డ్ ETF, HDFC గోల్డ్ ETF ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో లంప్సమ్ పెట్టుబడులను తాత్కాలికంగా పరిమితం చేయాలని నిర్ణయించినట్లు HDFC మ్యూచువల్ ఫండ్ తన ప్రకటనలో తెలిపింది. HDFC గోల్డ్ ETFకు సంబంధించి జూన్ 8, 2026 నుండి పెద్ద పెట్టుబడిదారులు నేరుగా ఫండ్ హౌస్‌తో చేసే సబ్‌స్క్రిప్షన్ లావాదేవీలను అంగీకరించరు. రూ. 25 కోట్ల పెట్టుబడులకు ఈ పరిమితులు వర్తిస్తాయని ప్రకటించింది. ఇక HDFC గోల్డ్ ETF ఫండ్ ఆఫ్ ఫండ్ విషయానికొస్తే.. మొదటి హోల్డర్ స్థాయిలో ప్రతి క్యాలెండర్ నెలకు ఒక్కో పాన్ నంబర్‌కు రూ. 10 లక్షల వరకు మాత్రమే లంప్సప్‌గా కొనుగోళ్లు, స్విచ్-ఇన్ లావాదేవీలు చేయవచ్చని స్పష్టం చేసింది. జూన్ 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల కట్ఆఫ్ సమయం తర్వాత స్వీకరించబడిన లావాదేవీలకు ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది.

తగ్గుతున్న బంగారం ధరలు

బంగారం, వెండి దిగుమతులపై ప్రభావవంతమైన పన్నును 9.2 శాతం నుంచి 18.4 శాతానికి కేంద్రం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ పరిమితులు విధించింది. అటు గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. వెండి ధరలు కూడా ఇదే బాటలో తగ్గుముఖం పట్టాయి. గత  వారం రోజులుగా వరుసగా ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు.

Follow Us