వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కనివేడు వద్ద జాతీయ రహదారి 44పై మామిడి లారీ బోల్తా పడింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ అడ్డంగా పడటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేషనల్ హైవేస్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.