Andhra: ఓ మహిళ, మరో నలుగురు వ్యక్తులు.. నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించారు.. కట్ చేస్తే..
ఒడిస్సా నుంచి బెంగుళూరుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న యువ దంపతులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసుల అప్రమత్తతతో భారీ మొత్తంలో గంజాయిను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం ఒకటవ పట్టణ పోలీసులతో పాటు జిల్లా టాస్క్ ఫోర్స్‌కు అందిన ఖచ్చితమైన సమాచారంతో రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గూడ్స్ షెడ్ రోడ్డులో రైడ్ నిర్వహించారు.

ఒడిస్సా నుంచి బెంగుళూరుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న యువ దంపతులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసుల అప్రమత్తతతో భారీ మొత్తంలో గంజాయిను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం ఒకటవ పట్టణ పోలీసులతో పాటు జిల్లా టాస్క్ ఫోర్స్‌కు అందిన ఖచ్చితమైన సమాచారంతో రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గూడ్స్ షెడ్ రోడ్డులో రైడ్ నిర్వహించారు. అక్కడ ఒక మహిళతో సహా నలుగురు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 40 ప్యాకెట్లలో దాచిన సుమారు 49 కిలోల గంజాయి బయటపడింది. ఈ గంజాయి విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే రూ.650 నగదు, రెండు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన వరుణ్ కుమార్, నిషా ఇద్దరు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఆ తరువాత జీవనోపాధి కోసం చిన్నాచితక పనులు చేసుకున్న వచ్చిన ఆదాయం అంతగా కుటుంబపోషణకు సరిపోలేదు. దీంతో ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. అలా పలు అక్రమ మార్గాల కోసం వెతుకుతుండగా కర్ణాటకకు చెందిన మౌలా భాయ్ అనే మరో గంజాయి పెడ్లర్ తో పరిచయం అయ్యింది.
అతని సూచనలతో మరో ఇద్దరు కర్ణాటకకు చెందిన నిందితులతో కలిసి గంజాయి అక్రమ వ్యాపారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఒడిస్సా రాష్ట్రంలోని రాయఘడకు వెళ్లి, అక్కడ నీలూ భాయ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి బెంగుళూరుకు తరలిస్తుండగా మధ్యలో విజయనగరం జిల్లాలో పోలీసులకు చిక్కారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Ganja Case
గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద సమాచారం తెలిసినా వెంటనే 112 లేదా 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
