Samantha: సమంత చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే 21 రోజుల్లో బరువు తగ్గుతారు.. చర్మం కూడా మెరిసిపోతుంది..
సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తోంది. సామ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడతే.. వెయిట్ లాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.

గతంలో లాగా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయకున్నా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సుమారు 16 సంవత్సరాలుగా ఆమె చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. సినిమాలతో పాటు మొదటి నుంచీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తుందీ అందాల తార. ఇక ఆ మధ్యన మయోసైటిస్ బారిన పడ్డాక ఫిట్‌నెస్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవడమే కాకుండా, స్వయంగా ఫిట్‌నెస్ గురించి అవగాహన కల్పించడం కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆమె పాడ్‌కాస్ట్‌లు చేస్తోంది. అలాగే ఇతరుల పాడ్‌కాస్ట్‌లలో పాల్గొని ఫిట్‌నెస్ ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు సమంత, ఫిట్‌గా ఉండటానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాను ప్రతిరోజూ చేసే ఎనిమిది పనులను వివరించింది.’పవర్ మార్నింగ్’ అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్.
సమంత ప్రతిరోజూ పాటించే ఎనిమిది పనులు
- ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి గంటసేపు మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్ లేదా వార్తలకు దూరంగా ఉండండి. దీనివల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.
- నిద్రలేచిన తర్వాత, కనీసం ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని, శ్వాస తీసుకోండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, శరీరం కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.
- ఉదయం నిద్రలేచిన 10 నిమిషాలలోపు మీ ముఖానికి తప్పకుండా సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. దీని వల్ల శరీరానికి మంచి లాభాలు ఉన్నాయి.
- ఉదయం పూట నిమ్మరసం, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, కొద్దిగా ఆలివ్ నూనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగండి. ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది.
- రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచే, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం తినండి. ఇది జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. సమంత విజ్ఞప్తి ఏమిటంటే, అసలు జంక్ ఫుడ్ తినవద్దు.
- ఉదయం 11 గంటలకల్లా వ్యాయామాలు కంప్లీట్ చేయండి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. సమంత రోజుకు రెండు గంటలు జిమ్‌లో గడుపుతుంది.
- కాఫీ లేదా టీని అల్పాహారం తర్వాత మాత్రమే తాగండి. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం మానుకోండి. ముందుగానే నిర్ణయించుకుని, ఆ రోజు మీరు పూర్తి చేయాల్సిన పనులను రాసుకోండి. దీనివల్ల మీ మెదడు అనవసరమైన విషయాల వైపు మళ్లకుండా ఉండి, మీ ఏకాగ్రత పెరుగుతుంది.
- ఈ పద్ధతులను కనీసం 21 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలని సమంత సలహా ఇస్తోంది. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా, మానసిక ఆరోగ్యం, చర్మ కాంతి కూడా మెరుగుపడతాయని ఆమె అంటోంది..
సమంత చెప్పిన పవర్ మార్నింగ్ వీడియో ఇదే..
View this post on Instagram
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఈ కథనంలోని అంశాలు ఆరోగ్య నిపుణుల సలహాలు, అందుబాటులో ఉన్న పరిశోధనల ఆధారంగా రూపొందించినవి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని పాటించే ముందుకు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం




