ఖాళీ కడుపుతో ఈ ఆకుల నీటిని ఎప్పుడైనా తాగారా?

04 March 2026

TV9 Telugu

TV9 Telugu

కూర, చారు, పచ్చడి.. ఎందులోనైనా కాస్తంత కొత్తిమీర వేస్తే ఆ పరిమళానికి నోట్లో నీళ్లూరతాయి. చెప్పాలంటే దీని రంగూ రుచీ వాసన.. అన్నీ అద్భుతమే

TV9 Telugu

అందుకే కొత్తిమీరను ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. ఆ పరిమళం అలాంటిది. ఎందులో వేసినా.. దాని రుచి రెట్టింపైపోతుంది. ఇది రుచికే కాదండోయ్‌, ఆరోగ్యానికీ మంచిదే

TV9 Telugu

కొత్తి మీర రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి

TV9 Telugu

వేళ్లను తీసేసి కడిగి.. గ్లాసున్నర నీళ్లలో ఉడికించాలి. బాగా తెర్లుతున్నప్పుడు దించేయాలి. గోరువెచ్చగా అయ్యాక చిటికెడు ఉప్పు, పావు చెంచా నిమ్మరసం కలపాలి. అంతే కొత్తి మీర నీళ్లు రెడీ అయినట్లే

TV9 Telugu

ఈ నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్నవారు తప్పకుండా తాగాలి

TV9 Telugu

నూరిన కొత్తిమీర.. కాస్త లేతగా ఉన్న ఆరేడు కొత్తిమీర రెమ్మలను కడిగి మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అందులో రెండు కప్పుల నీళ్లు, చెంచా తేనె, పావు చెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలపాలి

TV9 Telugu

ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో చేరిన కాలుష్యాలను బయటకు పంపేస్తుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది

TV9 Telugu

కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఊబకాయం రానివ్వదు. రక్తహీనత నుంచి బయటపడొచ్చు. ఎముకలు దృఢంగా ఉంటాయి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు