నేహా శెట్టి బ్రేక్ తీసుకుందా..? అమ్మడికి ఆఫర్స్ రావడం లేదా.? 

Rajeev 

5 February 2026

 నేహా శెట్టి..! చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. మెహబూబా సినిమాతో హీరోయిన్ గా మారింది. 

తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది నేహా శెట్టి. 

 సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది.

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తనే నేహా శెట్టి.

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఒక్కసారిగా గ్లామర్ క్రేజ్ సంపాదించుకుంది.

డీజే టిల్లు తర్వాత నేహాకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించింది. హీరో కార్తికేయ జోడిగా బెదురులంక చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు ఆఫర్స్ మాత్రం ఇవ్వలేదు.