ఆఫర్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారు.. ఇప్పుడు ఒక్కో పాటతో శాసిస్తుంది
Rajitha Chanti
Pic credit - Instagram
06 February 2026
నటనపై ఆసక్తితో కెనడా నుంచి ఇండియాకు వచ్చింది. చేతిలో 5వేలతో భారత్ చేరుకున్న ఆమె ముంబైలోని నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగింది.
కానీ ఆఫర్స్ ఇచ్చి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారు పలువురు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆమె ఒక్కో పాటతో ఇండస్ట్రీని శాసిస్తుందని తెలుసా.
తనే హీరోయిన్ నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి. కెనడాలో జన్మించిన ఈ బ్యూటీ నటిగా మారేందుకు ముంబై చేరింది.
ఎన్నో సవాళ్లు, కష్టాలను ఎదుర్కోని సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె డ్యాన్స్, స్టెప్పులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
సోషల్ మీడియాలో 4.6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 45కి పైగా చిత్రాల్లో నటించింది. స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్.
2012లో 'ఫగ్లీ' చిత్రంతో అరంగేట్రం చేసింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. అయినా ప్రయత్నాలు మాత్రం వదల్లేదు.
దిల్ బార్, కమారియా, ఓ సాకి సాకి అనే స్పెషల్ పాటలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. ముఖ్యంగా ఆమె లుక్స్, డ్యాన్స్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డ్యాన్సింగ్ క్వీన్ ఆమె. కేవలం రూ.5000లతో మొదలు పెట్టి ఇప్పుడు ఒక్కో పాటకు 3 కోట్లు తీసుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్