AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో JD.. పెద్ద KD..!! జేడీ చక్రవర్తి ఈవెంట్‌కు పిలిచినందుకు ఫీల్ అవుతున్నా..: చంద్రహాస్

చంద్రహాస్.. ఇప్పుడు ఇతని పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు కానీ ఇండస్ట్రీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్.. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు హిట్ చూడని చంద్రహాస్ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అమ్మో  JD.. పెద్ద KD..!! జేడీ చక్రవర్తి ఈవెంట్‌కు పిలిచినందుకు ఫీల్ అవుతున్నా..: చంద్రహాస్
Gunji Gunji Song Controvers
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2026 | 6:23 PM

Share

టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన చంద్రహాస్ ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో చంద్రహాస్ వివాదంలో చుక్కుకున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ ఓ పాట పాడాడు. ఈ పాట వివాదంగా మారింది. స్టేజ్ పై అందరి ముందు పాట పాడుతూ బూతులు ఉపయోగించాడు. సినిమాలో లేని లిరిక్స్ ను యాడ్ చేసి ఇష్టమొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా పాడి వివాదంలో చిక్కుకున్నాడు.

ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చంద్రహాస్ స్టేజ్ ఎక్కి పిచ్చి పిచ్చిగా బూతులు వాడుతూ పాట పడుతున్నా కూడా అక్కడికి హాజరైన గెస్ట్ లు కూడా దాన్ని ఆపకుండా.. అతను చేసింది తప్పు అని చెప్పకుండా పాటను ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత వివాదం చెలరేగడంతో అతను అలా పాడి ఉండాల్సింది కాదు అంటూ వీడియోలు వదిలారు. దాంతో చంద్రహాస్ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జే.డీ చక్రవర్తి అలా చేయడం కరెక్ట్ కాదని.. అప్పుడు  నేను పాడినప్పుడు ఆయన ఎంజాయ్ చేశాడు. లేచి మరీ చప్పట్లు కొట్టాడు. ఆతర్వాత వీడియో చేశాడు అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు.

రీసెంట్ గా ఓ డిబేట్ కు హాజరైన చంద్రహాస్ జేడీ గురించి మాట్లాడుతూ.. ఆయనను ఈవెంట్ కు పిలిచినందుకు నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా.. నేను పాడినప్పుడు అక్కడే ఆయన తప్పు అని చెప్పి నన్ను కొట్టినా.. ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ బయటికి వచ్చి జే.డీ.చక్రవర్తి తన మాట మార్చడం తనను తీవ్రంగా బాధించిందని చంద్రహాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. జే.డీ.చక్రవర్తి తన తండ్రికి ఫోన్ చేసి, తాను (చంద్రహాస్) ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొంచెం హార్ష్‌గా మాట్లాడతాను, ఫీల్ అవ్వొద్దు అని చెప్పమని కోరారని, అలాగే ఈ వివాదం వల్ల మైలేజ్ వస్తుంది, ఇది వైరల్ అవుతుంది, మంచిదే అని చెప్పాడని చంద్రహాస్ తెలిపాడు. ఒక ప్రముఖ వ్యక్తి ఇలా రెండు రకాలుగా ప్రవర్తించడం సరికాదని.. తప్పు అయితే తప్పు అని చెప్పాలని, ఖండించాలని, అప్పుడు తాను ఒప్పుకుంటానని చంద్రహాస్ అసహంనం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..