AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలో దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే వీటిలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఉన్నాయి

ఓటీటీలో దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 9:56 PM

Share

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తూనే.. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఓటీటీ అభిమానులను ఆకట్టుకునేలా.. పదుల సంఖ్యలో సినిమాలు ప్రతివారం విడుదల అవుతున్నాయి. ఇక ఈ వారం సంక్రాంతి సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. జియో హాట్ స్టార్ లో రాజా సాబ్ సినిమా విడుదలకానుంది. ఇక ఓటీటీల్లో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఓ కోర్ట్ డ్రామాలు ఓటీటీని షేక్ చేస్తున్నాయి.

సోనీ లివ్‌ ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సిరీస్ లు ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఈ టాప్ సిరీస్ ల్లో ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. మొదటిది కోర్ట్ కచేరీ ఇది సోనీ లివ్‌లో విడుదలైన వెబ్ సిరీస్. ఇందులో కాస్త కామెడీ కూడా ఉంటుంది. ఇది 13 ఆగస్టు 2025న విడుదలైంది. ఇది IMDbలో 7.1 రేటింగ్ సొంతం చేసుకుంది. మరొకటి రైజింగ్‌హాని vs రైజింగ్‌హాని ఇది సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్. ఇది ఒక చట్టపరమైన పోరాటం ఆధారంగా రూపొందించారు. 2024 సంవత్సరంలో విడుదలైన ఈ సిరీస్‌లో కరణ్ వాహి, జెన్నిఫర్ విజెంట్, రీమ్ షేక్ నటించారు. రైజింగ్‌హాని vs రైజింగ్‌హానికు అనిరుధ్ రాజ్‌దార్కర్ దర్శకత్వం వహించారు. దీనికి IMDbలో 6.2 రేటింగ్ లభించింది.

మరొకటి గుడ్ బ్యాడ్ గర్ల్ లో, ఒక మధ్యతరగతి అమ్మాయి వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె పేరు మాయా అహుజా. ఆమె కూడా వింత పరిస్థితులను ఎదుర్కొంటుంది. సమృద్ధి దివాన్, వైభవ్ రాజ్ గుప్తా, గుల్ పనాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించిన యువర్ హానర్ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. జిమ్మీ షెర్గిల్, మితా వశిష్ట్, యశ్పాల్ శర్మ కీలకపాత్రలు పోషించారు. మొత్తం 22 ఎపిసోడ్లు ఉన్నాయి. దీనికి IMDbలో 7.2 రేటింగ్ లభించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us