ఏం ప్లాన్ చేస్తున్నావ్ అన్న..! ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్.. అస్సలు ఊహించలేదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఎల్దండి. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో నవ్వించిన వేణు.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఫేమస్ అయ్యాడు. అటు సినిమాలు.. ఇటు కామెడీ షోలతో అలరించిన వేణు.. దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం బలగం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు.

బలగం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు నటుడు వేణు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినవేణు గతంలో కమెడియన్ గా సినిమాలు చేసి మెప్పించాడు. ఆతర్వాత దర్శకుడిగా మారి బలగం సినిమా చేశాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్, సుధాకర్‌రెడ్డి, వేణు, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు వేణు. ఇటీవలే ఎల్లమ్మ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా హీరోగా ఎవరు నటిస్తున్నారు అనేది మొన్నటివరకు సస్పెన్స్ గా సాగింది. నాని, నితిన్, బెల్లం కొనసా సాయి శ్రీనివాస్ పేరులు వినిపించాయి.
కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఇక టైటిల్ గ్లింప్స్ లో దీవి లుక్ పిచ్చేక్కించిందనే చెప్పాలి. ఈసారి వేణు సాలిడ్ కథతో రాబోతున్నాడని ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎల్లమ్మ సినిమాలో నటించే విలన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కు పోటీగా ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో వడ్డే నవీన్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా పెళ్లి సినిమా ఆయనను లవర్ బాయ్ గా మార్చేసింది. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా అవి సక్సెస్ కాలేదు.. ఇటీవలే కానిస్టేబుల్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వడ్డే నవీన్ విలన్ గా మారి ఎల్లమ్మలో అదరగొట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ నవీన్ విలన్ గా చేస్తే మాత్రం ఆయన కెరీర్ టర్న్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



