AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

Phani CH
|

Updated on: Feb 06, 2026 | 9:40 AM

Share

గుంటూరుకు చెందిన కిరణ్ కోల్పాకుల, DDC 0001 ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు చెల్లించి దేశ రికార్డు సృష్టించారు. ఇది కేవలం విలాసం మాత్రమే కాదు, స్టేటస్ సింబల్ కూడా. బిగ్ బాయ్ టాయ్స్ (BBT) ఆక్షన్ హౌస్ ద్వారా ఈ నంబర్ వేలంలో దక్కించుకున్నారు. BBT సెలబ్రిటీల లగ్జరీ కార్లు, VIP మొబైల్ నంబర్లను కూడా వేలం వేస్తుంది.

వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం భారీగా ఖర్చు చేయడం ఒక విలాసం మాత్రమే కాదు స్టేటస్ సింబల్ కూడా. ఓ వ్యక్తి ఓ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచారు. ఇది భారత్‌లో అత్యంత ఖరీదైన డీల్‌గా చరిత్ర సృష్టించింది. గుంటూరు వాసి కిరణ్ కోల్పాకుల సంచలనం క్రియేట్‌ చేశాడు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వాహన నెంబర్ ప్లేట్ కోసం ఒకటి కాదు రెండు కాదు రూ 2.08 కోట్లు ఖర్చు చేసారు. ‘DDC 0001’ అనే ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ BBT ఆక్షన్‌ హౌస్‌ యాప్ లో రూ. 2.08 కోట్లకు బిడ్‌ అయింది. ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ మామూలుగా ఉండదు మరి. అందుకే ఈ నంబర్ కోసం దేశంలోని సంపన్నులు పోటీ పడ్డారు. చివరకు 2.08 కోట్లకు వేలంలో దక్కించు కున్నారు కిరణ్‌. ఇది దేశంలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌. అరుదైన వస్తువులను సేకరించేవారు ఎంత ధరకైనా వెనకాడరని ఈ డీల్ నిరూపించింది. బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ కేవలం నంబర్ ప్లేట్లే కాకుండా, సెలబ్రిటీలు వాడిన లగ్జరీ కార్లు, అరుదైన వాచ్‌లు, VIP మొబైల్‌ నంబర్లను వేలం వేస్తుంది. నటి శిల్పా శెట్టికి చెందిన మెర్సిడిస్-మేబ్యాక్, దర్శకుడు రోహిత్ శెట్టికి చెందిన బెంజ్, క్రికెటర్ దినేష్ కార్తీక్ వాడిన రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు వేలానికి సిద్ధంగా ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !