రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్
55 ఏళ్ల సురేష్ దత్ గొంతులో 15 రోజులుగా 2-అంగుళాల జలగ జీవించింది. గొంతు బొంగురుపోవడం, తలనొప్పితో బాధపడిన అతనికి షిమ్లా వైద్యులు చికిత్స అందించారు. కెమెరా సహాయంతో శ్వాసకోళనాళానికి అతుక్కున్న జలగను గుర్తించి, వాక్యూమ్ పరికరంతో సురక్షితంగా తొలగించి ప్రాణాలు కాపాడారు. జలపాతంలో స్నానం చేస్తుండగా జలగ నోట్లోకి వెళ్లిందని డాక్టర్లు తెలిపారు.
రక్తాన్ని పీల్చేసే జలగ గత 15 రోజులుగా అతని గొంతులోనే జీవిస్తోంది. ఇంతకీ అంత పెద్ద జలగ అతని నోట్లోకి ఎలా దూరిందీ? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. జలగ పట్టుకుందంటే రక్తం పీల్చే వరకు వదలదు. అలాంటిది 55 ఏళ్ల సురేష్ దత్ గొంతులో 15 రోజులు తిష్ట వేసింది. అతని రక్తం పీలుస్తూ బాగానే బతికేసింది. ఆ విషయం అతనికి కూడా తెలీదు. గొంతు బొంగురుపోవడంతో పాటు గొంతులో ఏదో అడ్డుతున్న ఫీలింగ్ అతనికి కలిగింది. మంటతో పాటు తీవ్ర తలనొప్పితో అతను బాధపడ్డాడు. షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. ముందుగా ఈఎన్‌టీ వైద్యులు అతని గొంతును పరిశీలించి చూసారు. తమ దగ్గర సరైన పరికరాలు లేకపోవడంతో ఛాతీ స్పెషలిస్ట్‌కు కేసును రెఫర్ చేసారు. వైద్యులు సురేష్ దత్ ఛాతీలోకి చిన్న కెమేరాను పంపారు. శ్వాసకోళనాళానికి జలగ అతుక్కున్నట్లు తెలుసుకుని షాకయ్యారు. వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి 20 నిమిషాల్లో జలగను బయటకు తీసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. దాని పొడవు సుమారు రెండు ఇంచులు ఉంది. వైద్యులు వెలికి తీసిన ఆ జలగ బతికే ఉండటం గమనార్హం. ఆ జలగ నోట్లోకి ఎలా వెళ్లిందని సురేష్ దత్‌ను ప్రశ్నిస్తే.. ఇటీవల తను జలపాతంలో స్నానం చేశానని, అప్పుడే దాన్ని మింగి ఉంటానని తెలిపాడు. ఆ తర్వాత నుంచి తనకు తలనొప్పి, గొంతు నొప్పి రావడం మొదలయ్యాయని అన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని నీటిలో దిగినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.720 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల
పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా
మైఖెల్ జాక్సన్ బయోపిక్.. ట్రైలర్ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్
అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..
శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్..
కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే
రోగి గొంతులో నుంచి.. బతికున్న జలగ తొలగింపు
శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల
పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా
కేదార్‌నాథ్‌లో పాత కాలిబాట మార్గం ఓపెన్.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.

