AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల

శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల

Phani CH
|

Updated on: Feb 05, 2026 | 4:42 PM

Share

కడప కేంద్రంగా ఉదయభాస్కర్ నడుపుతున్న 'గో న్యూ హాలిడేస్' ట్రావెల్ ఏజెన్సీ 50 మందికి పైగా పర్యాటకులను శ్రీలంకలో మోసం చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ. 60 వేలు వసూలు చేసి, వసతి, రవాణా లేకుండా గాలికి వదిలేసింది. బాధితులు ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమను సురక్షితంగా స్వదేశానికి చేర్చి, మోసగాడిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటన సంచలనం రేపింది.

విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్న పర్యాటకుల ఆశలను ఆసరాగా చేసుకుని ఓ ట్రావెల్ ఏజెన్సీ నిలువునా ముంచేసింది. ‘గో న్యూ హాలిడేస్’ పేరుతో రామేశ్వరం, శ్రీలంక టూర్ ప్యాకేజీలు ప్రకటించి, సుమారు 50 మందికి పైగా పర్యాటకులను శ్రీలంకలో గాలికి వదిలేసిన ఘటన సంచలనం రేపుతోంది. కడప కేంద్రంగా ఉదయభాస్కర్ అనే వ్యక్తి ‘గో న్యూ హాలిడేస్’ సంస్థను నడుపుతున్నాడు. శ్రీలంక పర్యటన కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 60 వేల చొప్పున వసూలు చేశాడు. హైదరాబాద్ నుంచి 40 మంది, బెంగళూరు నుంచి 11 మంది పర్యాటకులు ఈ ప్యాకేజీని నమ్మి విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ తమ ప్రతినిధి రిసీవ్ చేసుకుంటాడని చెప్పి నమ్మించిన ఉదయభాస్కర్, పర్యాటకులు అక్కడికి చేరుకున్నాక చేతులెత్తేశాడు. అక్కడికి వెళ్లిన పర్యాటకులకు హోటల్ వసతి, రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడి లోకల్ ట్రావెల్ సంస్థల సాయంతో తలదాచుకున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న తిరుగు ప్రయాణం కోసం బుక్ చేసిన రిటర్న్ టిక్కెట్లు క్యాన్సిల్ అవ్వకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కష్టార్జితాన్ని దోచుకుని, విదేశాల్లో తమను అనాథలుగా వదిలేసిన ఉదయభాస్కర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, సురక్షితంగా తమను స్వదేశానికి చేర్చాలని బాధితులు కోరుతున్నారు. ఏజెంట్ మోసంపై బాధితులు తమ సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు విడుదల చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా

మైఖెల్ జాక్స‌న్ బయోపిక్‌.. ట్రైలర్‌ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్‌

250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్