AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి.. దెబ్బకు తుర్రు మననాల్సిందే!

చలికాలంలో చాలా మంది జలుబు లేదా జ్వరం వంటి వ్యాధుల భారీన పడుతూ ఉంటారు. అలాంటప్పుడు శరీరం బలహీనంగా మారుతుంది , నోటిలో చేదు రుచి ఉంటుంది. ఏది తినాలి అనిపించదు. కానీ ఇలాంటి సందర్భాల్లో మీరు చికెన్ సూప్ తీసుకుంటే అది మీకు ఎంతో ఉపసమనాన్ని కలిగొస్తుంది. అలాగే మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. డైటీషియన్ల ప్రకారం, చికెన్ సూప్ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి , ఇది అనారోగ్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి.. దెబ్బకు తుర్రు మననాల్సిందే!
Chicken Soup For Cold And Flu
Anand T
|

Updated on: Feb 06, 2026 | 4:42 PM

Share

చికెన్ సూప్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల సమతుల్యత ఉంటుంది. చికెన్ నుండి వచ్చే ప్రోటీన్ శరీరం తనను తాను బాగుచేసుకోవడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. క్యారెట్, బఠానీలు వంటి కూరగాయలు చికెన్‌తో పాటు బలహీనతను తగ్గించడానికి అవసరమైన విటమిన్లు. ఖనిజాలను అందిస్తాయి. అదనంగా, అనారోగ్యం సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. వేడి చికెన్ సూప్ శ్లేష్మం సడలించి గొంతు నొప్పిని తగ్గిస్తుందని డైటీషియన్లు అంటున్నారు. అంతేకాకుండా, ఇది శ్వాసను సులభతరం చేస్తుంది.

చికెన్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • వెన్న – 2 టేబుల్ స్పూన్లు
  • 2 ఉల్లిపాయలు – ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  • క్యారెట్లు, బఠానీలు – గుప్పెడు
  • చికెన్ ఉడికించిన నీరు – అర లీటరు
  • ఉడికించిన ఎముకలు లేని చికెన్ – 450 గ్రాములు
  • ఉప్పు – అవసరమైన విధంగా
  • మిరియాల పొడి – కొద్దిగా

చికెన్ సూప్ ఎలా తయారు చేయాలి..?

  • ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, దానికి కొద్దిగా వెన్న వేసి వేడి చేసి, తరిగిన ఉల్లిపాయ, బఠానీలు, క్యారెట్లు వేసి కూరగాయలను తేలికగా వేయించాలి.
  • అన్ని కూరగాయలు ఉడికిన తర్వాత, చికెన్ వేడినీరు వేసి, కలిపి, మూతపెట్టి, మీడియం మంట మీద మరిగించాలి.
  • అది ఉడకడం ప్రారంభించిన తర్వాత, మంటను తగ్గించి, ఉప్పు మరియు మిరియాలు వేసి, 10 నిమిషాలు మరిగించాలి.
  • దీని తరువాత, చికెన్ వేసి, మరిగించి, ఆపై స్టవ్ ఆపివేయండి.
  • దీన్ని ఒక గిన్నెలో పోసి వేడి సూప్ తాగండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us