PM Modi: ఎగ్జామ్స్ ఒత్తిడిని జయించడం ఎలా.. విద్యార్థులకు ప్రధాని మోదీ కీలక సూచనలు..
పరీక్షలంటే భయం ఎందుకు? వాటిని ఒక పండుగలా ఎందుకు జరుపుకోకూడదు? సరిగ్గా ఇదే విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ వేదికగా పరీక్షా పే చర్చ ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాని నేరుగా ముచ్చటిస్తున్నారు.
దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న కోట్లాది మంది విద్యార్థుల్లో ప్రధాని మోదీ ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఆయన ముచ్చటిస్తున్నారు. తన అధికారిక నివాసంలో దేశంలోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాని ఇంటరాక్ట్ అయ్యారు. జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో సాగుతున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం పరీక్షలను ఒక భారంగా కాకుండా ఒక ఉత్సవంలా జరుపుకోవడం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు పరీక్షల సమయంలో తలెత్తే మానసిక ఒత్తిడిని ఎలా జయించాలో ప్రధాని సూచనలు ఇస్తారు.
ఎగ్జామ్ వారియర్స్‌తో చిట్ చాట్
పరీక్షల సమయంలో సమయ పాలన, ఏకాగ్రత, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా బయటపడాలో ప్రధాని తనదైన శైలిలో విద్యార్థులకు వివరించనున్నారు. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులకే కాకుండా, పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఈ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

