Tollywood: ఈ క్యూటీ ఎవరో తెలుసా..? ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. అదృష్టం అందనంత దూరంలో..

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఆ క్యూటీ

Tollywood: ఈ క్యూటీ ఎవరో తెలుసా..? ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. అదృష్టం అందనంత దూరంలో..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2024 | 7:25 PM

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఆ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ ఆ తర్వాత అదృష్టం కలిసిరాలేదు. దీంతో ఈ బ్యూటీకి సినీ పరిశ్రమలో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. తనే హీరోయిన్ అనన్య. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

శర్వానంద్, జై, అంజలి కలిసి నటించిన జర్నీ చిత్రంలో అనన్య కథానాయికగా నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత నితిన్, సమంత కలిసి నటించిన అఆ సినిమాలో హీరో చెల్లిగా కనిపించింది. అలాగే తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అనన్య..స్వస్థలం ఎర్నాకులం జిల్లా పెరుంబవూరు. పై బ్రదర్స్, వృద్ధనేహే బెహవా వంటి సినిమాల్లో అనన్య బాలనటిగా నటించింది.

2008లో సినీరంగంలోకి అడుగుపెట్టింది అనన్య.. అదే ఏడాది తమిళంలో నాడోడిటిల్ సినిమాతో అరంగేట్రం చేసింది. సీక్రెట్ పోలీస్, షికార్, ఒరు స్మాల్ ఫ్యామిలీ, సీనియర్స్, డాక్టర్ లవ్, కాందహార్, సీనియర్స్, డాక్టర్ లవ్, ఎంకేయ్ ఎపోతుమ్, కుంజలియన్, మాస్టర్స్, నాటోడిమన్నన్, టియాన్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో నటించింది. అనన్య విలువిద్యలో రాష్ట్ర/జాతీయ ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు (2006, 2007) గెలుచుకుంది. అనన్యకు మోటార్ సైకిల్ రేసింగ్ అంటే కూడా చాలా ఆసక్తి. అనన్య బుల్లెట్ మోటార్ సైకిల్ నడపడంలో నిపుణురాలు.

View this post on Instagram

A post shared by Ananyaa (@ananyahere)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.