Tollywood: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. పెళ్లైన హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభిమానులను సంపాదించుకుంటారు కొందరు తారలు. కానీ మరికొందరు హీరోయిన్స్ మాత్రం కథానాయికగా ఎదిగే సమయంలో చేసిన తప్పులు వారి కెరీర్ నే నాశనం చేస్తుంటాయి. కెరీర్ లో ఎదురైన పరిచయాలు స్నేహంగా మారడం.. ఆ తర్వాత ప్రేమ, రిలేషన్ షిప్ అంటూ కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది.

Tollywood: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. పెళ్లైన హీరోతో ఎఫైర్.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..
Nikita
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2024 | 7:07 AM

సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు రావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవమానాలు, విమర్శలను దాటుకుని ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొందరు ఆ ఇమేజ్ కాపాడుకోవడంలో తప్పటడుగులు వేస్తుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభిమానులను సంపాదించుకుంటారు కొందరు తారలు. కానీ మరికొందరు హీరోయిన్స్ మాత్రం కథానాయికగా ఎదిగే సమయంలో చేసిన తప్పులు వారి కెరీర్ నే నాశనం చేస్తుంటాయి. కెరీర్ లో ఎదురైన పరిచయాలు స్నేహంగా మారడం.. ఆ తర్వాత ప్రేమ, రిలేషన్ షిప్ అంటూ కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది. వ్యక్తిగత జీవితం గురించి వారు తీసుకునే నిర్ణయాలు సినిమాలకు దూరం చేస్తుంటాయి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా గడపిన హీరోయిన్.. జీవితంలో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా సినిమాలకే దూరమయ్యింది. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ? తనే హీరోయిన్ నిఖితా తుక్రాల్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా గడిపిన హీరోయిన్ నిఖితా తుక్రాల్. అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. కెరీర్ లో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా సినిమా ఆఫర్స్ కోల్పోయింది. స్టార్ డమ్ అందుకోవాల్సిన బ్యూటీ అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. ఎస్వీ కృష్ణరెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు సినిమాలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత హాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో సంబరం, కళ్యాణ రాముడు, డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆల్రెడీ పెళ్లైన స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపింది. ఈ విషయం బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ కూడా నిఖితా తీరుపై మండిపడ్డారు.

స్టార్ హీరోతో ప్రేమాయణం విషయం అతడి భార్యకు తెలియడంతో ఆమె నిఖితాకు వార్నింగ్ ఇచ్చింది. తన భర్తకు దూరంగా ఉండాలని సీరియస్ అయ్యింది. దీంతో నిఖితా తన ప్రేమను వదిలేసింది. ఆ హీరో మరెవరో కాదు.. ప్రస్తుతం అభిమాని హత్య ఆరోపణలతో జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్. ఆ సమయంలో ఆమెను వరుస వివాదాలు చుట్టుముట్టాయి. అప్పట్లో దర్శన్ భార్య అతడి పై గృహహింస కేసు కూడా పెట్టింది. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమలో నిఖిత, దర్శన్ వ్యవహరం పెద్ద దుమారమే రేగింది. దీంతో నిఖితపై కన్నడ సినీ నిర్మాతల సంఘం మూడేళ్లపాటు నిషేదం విధించింది.

ఆ తర్వాత నిఖితకు మరో భాషలో కూడా అవకాశం రాలేదు. కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తివేసినా కూడా నిఖితాకు ఆఫర్స్ రాలేదు. దీంతో ఆమె సినీరంగానికి దూరం కావాల్సి వచ్చింది. 2017లో వ్యాపారవేత్త గగన్ దీప్ మాగోను వివాహం చేసుకున్న నిఖితా..ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. వీరికి ఒక కూతురు ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిఖిత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.