Tollywood: ఇన్ స్టాలో 92 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ హీరోయిన్.. విరాట్ కోహ్లీ తర్వాత ఆమెకే ఎక్కువ..

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఒకే ఒక్క సినిమాతో ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతుంది.

Tollywood: ఇన్ స్టాలో 92 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ హీరోయిన్..  విరాట్ కోహ్లీ తర్వాత ఆమెకే ఎక్కువ..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 25, 2024 | 12:01 PM

ప్రస్తుతం ఇన్ స్టాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అతడికి 270 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 27 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అయ్యే ఖాతాల్లో విరాట్‌కు 16వ స్థానం ఉంది. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా ప్రియాంక చోప్రాను అధిగమించి ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రెండవ భారతీయ నటి. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఒకే ఒక్క సినిమాతో ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇంతకీ ఆ తార ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శ్రద్ధా కపూర్.

ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు ప్రస్తుతం 92 మిలియన్.. అంటే 9 కోట్ల 20 లక్షల మంది పాలోవర్స్ ఉన్నారు. వరల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రకు 91.8 మిలియన్ అంటే 9 కోట్ల 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాలో అత్యధికంగా అనుసరిస్తున్న భారతీయులలో నాల్గవ స్థానంలో ఉన్నావారు నరేంద్రమోదీ 91.3 మిలియన్స్ అంటే 9 కోట్లు 13 లక్షల మంది ఫాలోవర్స్. ఆ తర్వాత అలియా భట్ 85.2 మిలియన్స్, సల్మాన్ ఖాన్ 69.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే శ్రద్ధా కపూర్ ఇన్ స్టాలో ప్రధాని మోదీని దాటేసింది. ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రాను కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ సంచలనం సృష్టిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్ట్ 15న విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీ దేశవ్యాప్తంగా రూ.309 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యా్ప్తంగా రూ.441 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

స్త్రీ 2 చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలకపాత్రలు పోషించారు. 2018లో సూపర్ హిట్ అయిన స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. స్త్రీ, భేదియా, ముంజ్యా వంటి హారర్ కామెడీ చిత్రాలలో స్త్రీ 2 నాల్గవది. శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాహుబలి వంటి సెన్సెషన్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రంతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది శ్రద్ధా. ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించి మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.