Shraddha Kapoor: కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్..

Shraddha Kapoor: కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్..

Anil kumar poka

|

Updated on: Aug 25, 2024 | 11:11 AM

ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా సరే ఆయన్ని చూసేందుకు అభిమానులు పోటెత్తుతారు. సోషల్ మీడియాలోనూ మోదీకి గుర్తింపు గట్టిగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆయన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాటేసింది. ప్రస్తుతం ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా సరే ఆయన్ని చూసేందుకు అభిమానులు పోటెత్తుతారు. సోషల్ మీడియాలోనూ మోదీకి గుర్తింపు గట్టిగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆయన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాటేసింది. ప్రస్తుతం ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడి తర్వాత ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్లు, ప్రధాని మోదీకి దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మోదీని పక్కకు నెడుతూ మూడో స్థానానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వచ్చేసింది. ‘స్త్రీ 2’ సక్సెస్‌తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చేరింది. దీంతో ఇన్ స్టాలో మోదీని ఈమె అధిగమించినట్లయింది.

ట్విటర్‌లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. శ్రద్ధా కపూర్ విషయానికొస్తే చాన్నాళ్ల నుంచి హిందీలో సినిమాలు చేస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఆ చిత్రం ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఏదేమైనా ఇప్పుడు ‘స్త్రీ 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.