Sobhita Dhulipala: స్పెషల్ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్ హిట్ మూవీ సీక్వెల్..
కొత్త తరహా ప్రాజెక్ట్‌లు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకుసాగుతున్నారు నటి శోభిత ధూళిపాళ . తాజాగా బాలీవుడ్‌లో తెరకెక్కనున్న సూపర్‌హిట్ డాన్ 3 మూవీ సీక్వెల్‌లో ఆమె భాగం కానున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో సూపర్‌హిట్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాన్’. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘డాన్ 2’ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
కొత్త తరహా ప్రాజెక్ట్‌లు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకుసాగుతున్నారు నటి శోభిత ధూళిపాళ . తాజాగా బాలీవుడ్‌లో తెరకెక్కనున్న సూపర్‌హిట్ డాన్ 3 మూవీ సీక్వెల్‌లో ఆమె భాగం కానున్నట్లు తెలుస్తోంది.
బీటౌన్‌లో సూపర్‌హిట్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాన్’. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘డాన్ 2’ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా త్వరలో ‘డాన్ 3’ పట్టాలెక్కనుంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం రానుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శోభిత ధూళిపాళ్లను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫర్హాన్.. ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై శోభిత లేదా ఆమె టీమ్ ఏమాత్రం స్పందించలేదు.
శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ ఏడాదిలో ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ మూవీలో ఆమె నటించారు. ‘కల్కి’లో దీపికా పదుకొణెకు తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చారు శోభిత. మరోవైపు, నటుడు నాగచైతన్యతో ఆమె నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.