Samantha: ప్రేమంటే ఒక త్యాగం.. కానీ ఇప్పుడు మారిపోయింది.. సమంత ఎమోషనల్ పోస్ట్..

సమంత కొత్త లుక్ చూసిన అభిమానులు సామ్ ఇదేంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సామ్ చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. తన ఇన్ స్టాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఇన్ స్టా స్టోరీ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ప్రేమంటే త్యాగం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Samantha: ప్రేమంటే ఒక త్యాగం.. కానీ ఇప్పుడు మారిపోయింది.. సమంత ఎమోషనల్ పోస్ట్..
Samantha New
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 26, 2024 | 8:04 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలారోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేసిన సామ్.. ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి విదేశాల్లో చికిత్సలు తీసుకుంది. కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమా ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్ లో పాల్గొంటుంది. చివరిసారిగా ఖుషీ సినిమాలో కనిపించిన సామ్.. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తుంది. ఇటీవలే ఓ ఈవెంట్లో పాల్గొన్న సామ్ లుక్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. ఒకప్పుడు బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన సామ్..ఇప్పుడు అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయిందంటూ కామెంట్స్ చేశారు. సమంత కొత్త లుక్ చూసిన అభిమానులు సామ్ ఇదేంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సామ్ చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. తన ఇన్ స్టాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఇన్ స్టా స్టోరీ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ప్రేమంటే త్యాగం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

“చాలా మంది వ్యక్తులు, స్నేహాలు, రిలేషన్ షిప్స్ పరస్పరం చూస్తుంటారు. అందుకు నేను అంగీకరిస్తున్నాను.. మీరు ఇవ్వండి.. నేను ఇస్తాను. కానీ కొన్నిసార్లు ప్రేమను అవతలి వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు మీరు కూడా ఇవ్వగలరని నేను కొన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నాను. ఇది మీరు ఇవ్వడం అనేది ఎదుటివ్యక్తి నుంచి వస్తుంది.. అలాగే నేను ఇస్తాను.. మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇస్తాను.. కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది.. ప్రేమంటే ఒక త్యాగం. ఒక సీజన్ కోసం బ్యాలెన్స్ చిట్కాలు కూడా ఉన్నాయి. తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా ప్రేమను ఇస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ స్టోరీ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి
Samantha

Samantha

ఇటీవలే సామ్ ముంబైలో ఓ అవార్డ్ ఈవెంట్లో కనిపించింది. ఈ వేడుకలో సామ్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే సమంత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు. ఈ నెల ప్రారంభంలో, సిటాడెల్: హన్నీ బన్నీ టీజర్ విడుదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.