Priyanka Mohan: ఆఫర్స్ కోసం ఇలా చేస్తావా.. ? హీరోయిన్ ప్రియాంక మోహన్ పై ఫ్యాన్స్ సీరియస్..
ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇటీవల ఆగస్ట్ 24న సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ప్రియాంక చేసిన కామెంట్స్ పై అడియన్స్ మండిపడుతున్నారు. ఆఫర్స్ కోసమే ఇలా మాట్లాడిందంటూ నెట్టింట ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది. ఇలాగే న్యాచురల్ స్టార్ నాని జోడిగా సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇటీవల ఆగస్ట్ 24న సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ప్రియాంక చేసిన కామెంట్స్ పై అడియన్స్ మండిపడుతున్నారు. ఆఫర్స్ కోసమే ఇలా మాట్లాడిందంటూ నెట్టింట ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ వేడుకలో ప్రియాంక మాట్లాడుతూ.. ఎస్జే సూర్యను ఓ రిక్వెస్ట్ చేసింది. మళ్లీ మీరు ఎప్పుడు డైరెక్షన్ చేస్తారు..? ఒకవేళ చేస్తే ఖుషి 2ను చేయండి.. అది కూడా పవన్ కళ్యాణ్ సర్ తోనే చేయండి అంటూ స్టేజ్ మీద చెప్పేసింది. ఇక ఇప్పుడు ఇవే మాటలపై తమిళ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమిళంలో విజయ్ దళపతి, జ్యోతిక కలిసి నటించిన ఒరిజినల్ సినిమా ఖుషి. దీనినే తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు.
ఇప్పుడు ప్రియాంక పవన్ కళ్యాణ్ తో సినిమా అనే సరికి ఆమె పై మండిపడుతున్నారు. ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ చేసిన సినిమానే బాగుందని అంటావా..? ఒకవేళ పార్ట్ 2 తీస్తే పవన్ కళ్యాణ్ తో తీయాలని సలహా ఇస్తావా ? ఆఫర్స్ కోసమే ఇలా మాట్లాడుతున్నావ్ కదా అంటూ చేస్తున్నారు. ప్రియాంక చేసిన కామెంట్స్ వీడియోస్ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
How cheap @priyankaamohan being here! Everyone clearly knows that Thalapathy Vijay's Kushi is fair ahead than Pawan Kalyan Kushi, but this cheap Priyanka for chance sake in Telugu industry & for her own survival hyping the remake version. 🤦🏻♂️🤦🏻♂️pic.twitter.com/YhUAenibye
— Kolly Censor (@KollyCensor) August 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.