AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi-Balakrishna: అభిమానులకు కన్నుల పండగ.. అప్యాయంగా పలకరించుకున్న చిరంజీవి, బాలకృష్ణ..

ఇందుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో ఫ్యా్న్స్ కూడా ఖుషీ అయ్యారు. కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అప్యాయంగా పలకరించుకున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. వీరిద్దరిని ఒకే వేదికపై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ కుమారుడి రిసెప్షన్ లో ఒకరికొకరు ఎదురుపడ్డారు.

Megastar Chiranjeevi-Balakrishna: అభిమానులకు కన్నుల పండగ.. అప్యాయంగా పలకరించుకున్న చిరంజీవి, బాలకృష్ణ..
Chiranjeevi, Balakrishna
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2024 | 10:48 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరి గురించి ఎప్పుడూ ఏదోక వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంటుంది. ఇక మెగా, నందమూరి అభిమానుల మధ్య అనేకసార్లు మాటల యుద్ధం నడుస్తుంది. చాలారోజులుగా వీరిద్దరు కలిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్‏స్టాపబుల్ షోకు మెగాస్టార్ అతిథిగా వస్తారని అంతా అనుకున్నారు. ఇందుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో ఫ్యా్న్స్ కూడా ఖుషీ అయ్యారు. కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అప్యాయంగా పలకరించుకున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. వీరిద్దరిని ఒకే వేదికపై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ కుమారుడి రిసెప్షన్ లో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా అప్యాయంగా పలకరించుకున్నారు.

టాలీవుడ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ వేడుక ఈనెల 22న ఘనంగా జరిగింది. ఇక హైదరాబాద్ లో ఈనెల 24న నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇదే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కూడా సందడి చేశారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఒకే వేడుకలో కలిసి కనిపించారు. ఈ సందర్బంగా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే బాలకృష్ణ ఎన్బీకే 109 చిత్రం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్