Bhumika Chawla: అయ్యా బాబోయ్.. ‘ఒక్కడు’ మూవీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..? భూమికను చూస్తే షాకే..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అదే ఏడాది ఎన్టీఆర్ జోడీగా సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో భూమిక పేరు మారుమోగింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ తెలుగు యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలోనూ సందడి చేసింది.

Bhumika Chawla: అయ్యా బాబోయ్.. 'ఒక్కడు' మూవీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..? భూమికను చూస్తే షాకే..
Bhumika
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2024 | 10:59 AM

ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా సత్తా చాటింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. హీరో సుమంత్ నటించిన యువకుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది భూమిక. ఫస్ట్ మూవీ పెద్దగా విజయం సాధించలేదు.. కానీ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఖుషీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడమే కాకుండా భూమికకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ మూవీతో ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఖుషీ చిత్రంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న భూమిక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అదే ఏడాది ఎన్టీఆర్ జోడీగా సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో భూమిక పేరు మారుమోగింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ తెలుగు యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలోనూ సందడి చేసింది.

హీరోయిన్ గా గ్లామర్ షోస్ మాత్రమే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మెరిసింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తేరే నామ్’లో ‘నిర్జరా’గా భూమిక విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆగస్ట్ 21న భూమిక 46వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. భూమిక తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి. మొదట సర్ఫ్ పౌడర్ ప్రకటనలో కనిపించిన భూమిక.. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది. అందుకే చదువు పూర్తయ్యాక 1997లో తన కలలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చింది. అలాగే భూమిక 2000 సంవత్సరంలో ‘యువకుడు’ అనే తెలుగు సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

భూమిక తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించింది. భూమిక తన ప్రియుడు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ భరత్ ఠాకూర్‌ని 2007లో వివాహం చేసుకుంది. భూమిక భర్త భరత్ యోగా టీచర్. నటనా రంగంలోకి అడుగుపెట్టిన భూమిక యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. యోగా నేర్చుకుంటున్న సమయంలో, భూమిక తన గురువు భరత్ ఠాకూర్‌తో కొద్ది రోజులకే ప్రేమలో పడింది. నాలుగేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. భూమిక చివరిసారిగా బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లో కనిపించింది. అలాగే తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో హీరో వదినగా కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.