AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘ అన్నయ్య మనసు బంగారం’.. ఈ బ్యూటిఫుల్ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు

మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) వస్తోంది. దీనిని పండగలా సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులందరూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల రక్తదానం శిబిరాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ 'అన్నయ్య మనసు బంగారం రా' రా అంటూ మెచ్చుకుంటున్నారు.

Chiranjeevi: ' అన్నయ్య మనసు బంగారం'.. ఈ బ్యూటిఫుల్ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 21, 2024 | 10:22 AM

Share

మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) వస్తోంది. దీనిని పండగలా సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులందరూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల రక్తదానం శిబిరాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ ‘అన్నయ్య మనసు బంగారం రా’ రా అంటూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఇటీవలే ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. రాజమౌళి, మహేశ్ బాబు లాంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కమిటీ కుర్రోళ్లు సినిమాను చూసి యూనిట్ ను మెచ్చుకున్నారు. అంతేకాదు మూవీ టీం అందర్నీ పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. అందరితో సరదాగా ఫొటోలు దిగారు.

కాగా కమిటీ కుర్రోళ్లు సినిమాలో 11 మంది కొత్త హీరోలు, 4 హీరోయిన్లు నటించారు. వీరందరూ కొత్త వాళ్లే. అలాంటిది వీరికి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫొటోలు దిగే ఛాన్స్ వచ్చింది. దీంతో కుర్రాళ్లందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ తో పోటీపడి మరీ సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే నటుడు యశ్వంత్ చిరంజీవి కోసం ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడు. ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో ఫోటో దిగడానికి యశ్వంత్ రాగా చిరు యశ్వంత్ పై చెయ్యి వేయగా, యశ్వంత్ కూడా మెగాస్టార్ వెనుక నుంచి చెయ్యి వేసేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే పక్కనే ఉన్న అసిస్టెంట్ యశ్వంత్ చెయ్యి తీసేసాడు. దీనిని గమనించిన చిరంజీవి ‘ వాళ్లు అలాగే అంటారు నువ్వు చేయి వేసుకో’ అని యశ్వంత్ తో అన్నాడు. యంగ్ హీరో పర్లేదు అంటున్నా చిరంజీవే స్వయంగా యశ్వంత్ చెయ్యి తీసుకొని తన వెనుక వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘ఎంతైనా మెగాస్టార్ మనసు బంగారం రా’ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కమిటీ కుర్రాళ్ల తో మెగాస్టార్ చిరంజీవి..

చిరంజీవితో యంగ్ హీరో యశ్వంత్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో