Mahesh Babu: మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేస్తూ కటౌట్ అదిరిపోయిందంతే

టాలీవుడ్ లో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ తర్వాత రమేశ్ బాబు, మహేశ్ బాబు, సుధీర్ బాబు.. ఇలా చాలా మంది హీరోలు వచ్చారు. ఇక విజయ నిర్మల వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నరేష్‌ వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు

Mahesh Babu: మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేస్తూ కటౌట్ అదిరిపోయిందంతే
Ghattamaneni Jayakrishna
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2024 | 12:38 PM

టాలీవుడ్ లో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ తర్వాత రమేశ్ బాబు, మహేశ్ బాబు, సుధీర్ బాబు.. ఇలా చాలా మంది హీరోలు వచ్చారు. ఇక విజయ నిర్మల వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నరేష్‌ వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే ఇప్పుడీ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు వస్తున్నాడు. హీరోగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ. ప్రస్తుతం యాక్టింగ్ కు సంబంధించి శిక్షణ తీసుకుంటోన్న జయకృష్ణ తాజాగా చేసిన ఓ ఫోటోషూట్‌ వైరల్‌గా మారింది. ఇందులో సూపర్ స్టైలిష్ గా పక్కా హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు జయకృష్ణ. పైగా కృష్ణ, మహేశ్ పోలికలు అతనిలో కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఘట్టమనేని అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చూడడానికి అచ్చం కృష్ణను తలపిస్తున్నాడని, ఫస్ట్ లుక్ తోనే కేకపెట్టిస్తున్నాడంటున్నారు.

ఇవి కూడా చదవండి

జయకృష్ణ తండ్రి దివంగత రమేశ్ బాబు గతంలో పలు సినిమాల్లో నటించాడు. సామ్రాట్, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, బజారు రౌడీ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అయితే ఆ తర్వాత నటించడం వదిలి పెట్టి నిర్మాతగా మారారు. అయితే రెండేళ్ల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు రమేశ్ బాబు.ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టిన ఈ అబ్బాయి హీరోగా సక్సెస్ అయితే తండ్రి కోరిక నెరవేరినట్టే. కాగా జయకృష్ణ కెరీర్ కు సంబంధించిన విషయాలను మహేశ్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు మహేశ్ వారసుడు గౌతమ్ ఘట్టమనేని అరంగేట్రానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో జయకృష్ణ సినిమాల్లోకి అడుగు పెట్టి కృష్ణ లెగసీని కంటిన్యూ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి